చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్న సర్పంచి ఖాదర్ బాషా
ప్రజాశక్తి-సంతమాగులూరు : మండల పరిధిలోని కొమ్మాలపాడు గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గ్రామ సర్పంచి ఖాదర్ మస్తాన్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ వేసవికాలం, వడగాలులు వీస్తుండడం, గ్రామ సచివాలయానికి వచ్చి పోయే ప్రజలు, సచివాలయ సిబ్బంది సౌకర్యార్ధం చలివేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.










