ప్రజాశక్తి-రేపల్లె: మదర్ థెరీసా ఆటోడ్రైవర్స్ యూనియన్ సీఐటీయూ ఆర్‌అండ్‌బి బంగ్లా పక్కనే ఉన్న ఆటోస్టాండ్‌లో చలివేంద్రాన్ని పట్టణ ఎస్‌ఐ అబ్దుల్ రజాక్, సీఐటీయూ బాపట్ల జిల్లా అధ్యక్షుడు సిహెచ్ మణిలాల్ ప్రారంభించారు. శ్రీరామనవమి సందర్భంగా ఆటో స్టాండ్‌లో పానకాన్ని ప్రయాణికులకు, డ్రైవర్లకు అందజేశారు. అనతరం రేపల్లె పట్టణ ఎస్‌ఐ అబ్దుల్ రజాక్ మాట్లాడుతూ వేసవికాలంలో ప్రయాణికులు, ప్రజలకు అందుబాటులో పట్టణంలో రద్దీగా ఉండే బస్‌స్టాండ్ పక్కనే ఆటోస్టాండ్‌లో చలివేంద్రం ఏర్పాటు చేయటం అభినందనీయ మని అన్నారు. ఆటో కార్మికులు తగు జాగ్రత్తలతో ప్రయాణికులను సురక్షితంగా గమ్యాలకు చేర్చాలని, అందరూ ఐక్యంగా ఉండాలని, ఏదైనా ఇబ్బందులు వస్తే 100కు డయల్ చేసి పోలీస్ స్టేషన్‌ను సంప్రదించవచ్చని అన్నారు. అన్ని వేళలా ఆటో డ్రైవర్లకు, ప్రజలకు పోలీస్ సేవలు అందుబాటులో ఉంటాయని అన్నారు. సీఐటీయూ బాపట్ల జిల్లా అధ్యక్షుడు సిహెచ్ మణిలాల్ మాట్లాడుతూ కార్మికులు ఐక్యంగా ఉండటం ద్వారా సమస్యలు ఎన్ని వచ్చినా ముందుకు వెళ్లవచ్చని అన్నారు. ఆటోస్టాండ్‌లో చలివేంద్రం ఏర్పాటు చేయడం ద్వారా ప్రయాణికులకు సేవ చేయవచ్చని పేర్కొన్నారు. ఈ చలివేంద్రం దొప్పలపూడి వంశీకృష్ణ సహకారంతో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మదర్ థెరిసా ఆటోస్టాండ్ అధ్యక్షులు కె వెంకటేశ్వరరావు, మరియు సిఐటియు నాయకులు జె ధర్మరాజు, కె ఆశీర్వాదం, కె రమేష్, డి శ్రీనివాసరావు ఆటో వర్కర్స్ డి వంశీకృష్ణ, బాబూరావు, భిక్షాలు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.










