Apr 26,2023 01:00
చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఇన్‌ఛార్జి కరణం వెంకటేష్‌

ప్రజాశక్తి-చీరాల: వేసవి తాకిడి పెరుగుతున్న నేపథ్యంలో మహాత్మాగాంధీ వెల్ఫేర్‌ సొసైటీ ఆధ్వర్యంలో బాటసారుల దాహాన్ని తీర్చేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జి కరణం వెంకటేష్‌బాబు అన్నారు. మంగళవారం స్థానిక ఎంజిసి క్లాత్‌ మార్కెట్‌ సమీపంలో ఏర్పాటు చేసిన చలివేంద్రానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ప్రజల అవసరాన్ని గుర్తించి చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన అన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ మామిడాల రాములు, శీలం రాఘవయ్య (బుజ్జి), శీలం వేణుగోపాల్‌, పొత్తూరి సుబ్బయ్య, చీమకుర్తి బాలకృష్ణ, బాంబే సురేష్‌, మల్లెల లలితరాజశేఖర్‌ తదితర నాయకులు పాల్గొన్నారు.