May 16,2021 13:29

రెక్కలు తెగిన ఆకాశం
భూమ్మీద ఉరుమై విరిగి పడుతుంది
రెక్కలు మొలిసిన సముద్రం
గగనంలోకి మెల్లగా వెళ్లి పోతుంది
ఆకాశం ఎప్పుడూ కిందికి చూస్తున్నట్లు ఉంటుంది
భూమి ఎల్లప్పుడూ పైకి చూస్తుంటున్నట్లు ఉంటుంది
ఏ యుగాన మొదలయ్యిందో !
కొన్ని చెట్లు , మరికొన్ని జంతువులు,
మేడలోని
రెండు చేతుల ప్రాణులు
బతికి బయటపడతాయి
విస్తరించిన వాన రెక్కల విశాలత్వం కింద
గూడు తడిచిన పిట్టలు
గింజల్లేని పిట్టలు
కూలిపోయిన పల్లె బయటి పాకలు
కురవడం ప్రకృతి సృష్టి
గుడిసెలు
కారడం, కాలడం చీకటి సంపద సృష్టి!
 

- రవి నన్నపనేని