Oct 26,2023 22:41

ప్రజాశక్తి-ఉయ్యూరు : చక్కెర పరిశ్రమలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి రైతు, పరిశ్రమ అభివద్ధికి కషి చేసిన సంస్కర్త వెలగపూడి మారుతీరావు అని కేసీపీ చక్కెర కర్మాగార ఉయ్యూరు యూనిట్‌ హెడ్‌ వై. సీతా రామదాస్‌ అన్నారు. కేసీపీ షుగర్స్‌ అండ్‌ ఇండిస్టీస్‌ మాజీ ఎండి వెలపూడి మారుతీరావు 91వ జయంతి కర్మాగార ఆవరణలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి సీతారామదాస్‌ ఇతర ఉద్యోగులు పూలు మాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ చక్కెర పరిశ్రమ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న రోజుల్లో పరిశ్రమ భవిష్యత్తుకు, చెరకు పండించే రైతులకు గిట్టుబాటు అయ్యేందుకు పలు సంస్కరణలు చేపట్టి సూచనలు చేశార ని గుర్తుచేశారు. మారుతీరావు జయంతి నాణ్యతా దినోత్సవంగా పాటిస్తున్న సందర్భంగా నాణ్యతా ఫలకాన్ని ఆవిష్కరించి యూనియన్‌ నాయకుడు బాలసుబ్రమణ్యంతో కలసి కార్మికుల నాణ్యతా ప్రతిజ్ఞచేయించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన 15 మంది కార్మికులకు వైద్య ఖర్చుల నిమిత్తం రూ. 3లక్షల చెక్కులు అందజేశారు.