Oct 27,2022 23:00

ప్రజాశక్తి-జగ్గయ్యపేట
స్థానిక పులిచింతల గెస్ట్‌ హౌస్‌ లో గండ్రాయి బ్రాంచ్‌ సాగర్‌ కాలువ ఆయకట్టు రైతులు, ఇరిగేషన్‌ శాఖ అధికారులతో శాసన సభ్యులు సామినేని ఉదయభాను గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ సాగర్‌ కాలువ పరిధిలోనే చివర భూములు వరకు నీటిని అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, దీనిలో భాగంగా కాలువలోని తూటి కాడ మట్టిని తొలగించి ఆయకట్టు కింద ప్రతి ఎకరానికి నీరు అందిస్తామని తెలిపారు. రైతులతో అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయపరుస్తూ రైతులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని, దీనికిగాను తూటి కాడ తొలగింపు ప్రక్రియ మొదలు పెడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్‌ చైర్మన్‌ తన్నీరు నాగేశ్వరరావు, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ తుమ్మల ప్రభాకర్‌, మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ ముత్తినేని విజరు శేఖర్‌, పట్టణ యువజన నాయకులు ఆవాల భవాని, మాజీ నీటి సంఘ ఉపాధ్యక్షులు ముండ్లపాడు వాసు, మాజీ నీటి సంఘం అధ్యక్షులు నరసాని రాంబాబు, వివిధ గ్రామాల రైతు నాయకులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎన్‌ఎస్‌పి ఈఈ శ్రీనివాస్‌, పులిచింతల ఈఈ శ్యామ్‌ ప్రసాద్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.