Oct 06,2023 23:06

కల్యాణ్‌ జ్యువెలర్స్‌ ప్రారంభిస్తున్న నాగార్జున

చిత్తూరులో అక్కినేని సందడి
కల్యాణ్‌ జ్యువెలర్స్‌ బ్ర్రాంచి ప్రారంభం
ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్‌
ప్రముఖ ఆభరణాల బ్రాండ్‌లలో ఒకటైన కళ్యాణ్‌ జ్యువెలర్స్‌, చిత్తూరులోని ఎంఎస్‌ఆర్‌ సర్కిల్‌, పలమనేరు రోడ్‌ వద్ద తమ సరికొత్త షోరూమ్‌ను ప్రారంభించింది. కళ్యాణ్‌ జువెల్లర్స్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ అక్కినేని నాగార్జున ఈ సరికొత్త షోరూమ్‌ను ప్రారంభించటానికి ప్రత్యేకంగా రావటం తో అభిమానులు పెద్ద సంఖ్యలో విచ్చేసారు. ఇది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కంపెనీ యొక్క తొమ్మిదో షోరూమ్‌. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ''చిత్తూరులో జరుగుతున్న వేడుకల్లో భాగమైనందుకు ఆనందంగా ఉంది. కళ్యాణ్‌ జ్యువెలర్స్‌ నా హదయంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది. భారతదేశ ఆభరణాల పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన బ్రాండ్‌తో సుదీర్ఘకాల అనుబంధాన్ని కలిగి ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది. 'ట్రస్ట్‌ ఈజ్‌ ఎవ్రీథింగ్‌' అనే సూత్రం పట్ల వారు చూపుతున్న అచంచలమైన అంకితభావం నిజంగా పరిశ్రమలో వారిని విభిన్నంగా నిలుపుతుంది. నమ్మకం, పారదర్శకత కస్టమర్‌ సంతప్తి కి ప్రతీకగా ఈ బ్రాండ్‌ నిలుస్తుంది.. దాని ప్రయాణంలో భాగం కావడం విశేషం. ఈ ప్రాంతంలోని అభిమానులు బ్రాండ్‌ కళ్యాణ్‌ జ్యువెలర్స్‌ పట్ల తమ ప్రేమను చూపుతారని, మద్దతును అందిస్తారని నేను విశ్వసిస్తున్నాను'' అని అన్నారు.
కళ్యాణ్‌ జ్యువెలర్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రమేష్‌ కళ్యాణరామన్‌ మాట్లాడుతూ, ''ఒక కంపెనీగా, మేము భారీ మైలురాళ్లను సాధించాం.. కస్టమర్‌ షాపింగ్‌ అనుభవాన్ని మెరుగుపరచడానికి సమగ్ర పర్యావరణ వ్యవస్థను రూపొందించే దిశగా పెద్ద పురోగతిని సాధించాం. మేము మా వద్ధి ప్రయాణం యొక్క ఈ తదుపరి దశను ప్రారంభించినప్పుడు, మా కొత్త షోరూమ్‌ను చిత్తూరు లో ప్రారంభించడం పట్ల మేము సంతోషిస్తున్నాము. ఈ ప్రారంభంతో, మేము ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మా కార్యకలాపాలను నిలకడగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం' అని అన్నారు కల్యాణ్‌ జ్యువెలర్స్‌ షోరూం ప్రారంభోత్సవం పురస్కరించుకుని కనీసం లక్ష రూపాయల విలువైన ఆభరణాలు కొన్న వారికి సగం కొనుగోలు విలువపై జీరో శాతం మేకింగ్‌ ఛార్జీలు అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఆఫర్‌ పరిమిత కాలానికే పరిమితమవుతుందని తెలిపారు.
కల్యాణ్‌ జ్యువెలర్స్‌ ప్రారంభిస్తున్న నాగార్జున