ప్రజాశక్తి-నక్కపల్లి:ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమ ఫలాలను లబ్ధిదారులకు సకాలంలో అందించడంలో సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు చిత్తశుద్ధితో పని చేయాలని ఎమ్మెల్యే గొల్ల బాబురావు కోరారు. మంగళవారం సాయంత్రం సారిపల్లివానిపాలెంలో వైసిపి నాయకులు శీరం నరసింహమూర్తి కొబ్బరి తోటలో సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. అధికారం చేపట్టిన వెంటనే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు ప్రజల ముంగిటకు అందించాలన్న లక్ష్యంతో సచివాలయ, వలంటీర్ల వ్యవస్థకు సీఎంగా జగన్ శ్రీకారం చుట్టారని అన్నారు. బాధ్యతగా విధులు నిర్వహిస్తూ జవాబుదారీతనంగా ఉండాల న్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అర్హులకు అందించడంలో వలంటీర్ల పాత్ర ఎంతో కీలకంగా మారింద న్నారు. ఏ ఒక్క అర్హులకు సంక్షేమ పథకం అందకపోయినా ఇబ్బందులు పడతారని, అటువంటి పరిస్థితి రానివ్వకూడదని సూచించారు. వలంటీర్లు తమ పరిధిలో వున్న కుటుంబాల పరిస్థితులు, అందుతున్న సంక్షేమ పథకాలపై ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలని తెలిపారు. నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు చింతలపూడి వెంకట రామయ్య మాట్లాడుతూ, కన్వీనర్లకు, వాలంటీర్లకు దిశా నిర్దేశం చేశారు .ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు శీరం నర్సింహమూర్తి, బొల్లం బాబ్జి , సూరకాసుల గోవింద్, ఎలమంచిలి తాతబాబు, లోడగల చందర్రావు, గొర్ల నరసింహమూర్తి, జనపరెడ్డి శేషారత్నం, గొర్ల బాబూరావు తదితరులు పాల్గొన్నారు.










