ప్రజాశక్తి - బాపట్ల
సిఎం జగన్మోహన్‌రెడ్డి పాలనలో ఛిద్రమైన రహదారులపై ప్రయాణానికి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని టిడిపి ఇన్‌ఛార్జి వేగేశన నరేంద్ర వర్మ మండిపడ్డారు. టిడిపి, జనసేన ఉమ్మడి కార్యాచరణలో భాగంగా ఆదివారం గుంతల రహదారులపై ఆంధ్రప్రదేశ్‌కు దారేది కార్యక్రమాన్ని నిర్వహించారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు- పొన్నూరు రహదారి మార్గంలో టిడిపి, జనసేన నాయకులు ఉమ్మడిగా నిరసన చేపట్టారు. చందోలు నుండి పొన్నూరు వెళ్లే రహదారి పూర్తి స్థాయిలో దెబ్బతినడంతో ప్రమాదాలు జరిగి అనేక మంది మృత్యువాత పడ్డారని అన్నారు. దెబ్బతిన్న రహదారులపై కనీసం మరమ్మతులు చేసిన దాఖలాలు లేవని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రోడ్ల వ్యవస్థ రూపురేఖలు మారాయని అన్నారు. గడిచిన ఐదేళ్ల పాలనలో ఏ ఒక్క రోడ్డు కూడా వేయలేదని అన్నారు. వైసీపీ సామాజిక బస్సు యాత్రలో సంగుపాలెం కోడూరు నుండి చందోలు దెబ్బతిన్న రోడ్డు నిర్మాణంపై కనీసం నోరు మెదపలేదని అన్నారు. టిడిపి, జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటైతే కచ్చితంగా ఈ రహదారులన్నీ బాగు చేయిస్తామని అన్నారు. జనసేన కో ఆర్డినేటర్ నామన వెంకట శివన్నారాయణ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వంలో మహిళలు ఎవ్వరూ సుఖంగా జీవించలేకపోతున్నారని అన్నారు. ఇంటి నుండి వాహనాలపై వెళ్లిన తండ్రి, కొడుకు, భర్త మళ్లీ తిరిగి ఇంటికి క్షేమంగా వస్తారో లేదో తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. వర్షాలు పడితే రహదారేదో చెరువేదో తెలియని దుస్థితి ఏర్పడిందని అన్నారు. ఆటోలు ఈ రోడ్లపై ప్రయాణంతో తరచూ మరమ్మత్తుల భారినపడి ఆర్థికంగా ఇల్లు ఒల్లు గుల్లవుతుందని అన్నారు. కార్యక్రమంలో జన సైనికులు దాదా, కలాం, అన్సారి, మలిశెట్టి గోపి, మెండు కిషోర్, అద్దంకి చందు, శ్రీకృష్ణ, విజయ మాధురి, సుజిత్, ఆంజనేెష్, సురేంద్ర, సాయి, మహేష్, గోగన ఆదిశేషు, ఇమ్మడిశెట్టి మురళి కృష్ణ, సుధాకర్, మడసాని బాలాజీ, శరాబంది, కూనపరెడ్డి శ్రీనివాసరావు టిడిపి నాయకులు అఫ్జల్, ఏపూరి భూపతిరావు, గొలపల శ్రీనివాసరావు, ముక్కామల సాంబశివరావు, కనమూరి సాంబమూర్తిరాజు, వెంకటపతి రాజు, ఇరగంటి గాంధీ, నక్కల వెంకటస్వామి, రామాంజి పాల్గొన్నారు.