Jun 07,2023 19:30

పోటీలు నిర్వహిస్తున్న దైవప్రసాద్‌

ప్రజాశక్తి - ఆదోని
చిత్రలేఖనం వల్ల విద్యార్థుల్లో వ్యక్తిత్వం వికసిస్తుందని విశ్రాంత ప్రధానోపాధ్యాయులు దైవప్రసాద్‌ తెలిపారు. బుధవారం పట్టణంలోని గ్రంథాలయ భవనంలో 31వ రోజు వేసవి విజ్ఞాన శిబిరంలో భాగంగా చిత్రలేఖనంపై విద్యార్థులకు అవగాహన కల్పించి పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దైవప్రసాద్‌ మాట్లాడారు. చిన్న తనంలోనే విద్యార్థులు సన్మార్గంలో నడిచేందుకు, సృజనాత్మక శక్తిని పెంచుకునేందుకు వేసవి విజ్ఞాన శిబిరాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ప్రథమ శ్రేణి గ్రంథాలయ అధికారిణి సుజాత మాట్లాడుతూ... గ్రంథాలయానికి వచ్చి వార్తా పత్రికలు, పుస్తకాలు చదవడం వల్ల విచక్షణ, విజ్ఞానం పెంపొందుతుందన్నారు. గ్రంథాలయాలను ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.