Nov 14,2023 21:52

బహుమతి పొందిన విజేతలతో ఎస్‌ఎస్‌ఎ పిఒ, జెవివి, యుటిఎఫ్‌ నాయకులు

 కడప అర్బన్‌ : కడప బాలోత్సవం నిర్వహించిన చిత్రలేఖనం పోటీలు మూడు విభాగాలలో ప్రథమ, ద్వితీయ, తతీయ బహుమతులు, నలుగురికి స్పెషల్‌ బహుమతులు ప్రదానం చేశారు. ఎస్‌వి ఇంజినీరింగ్‌ కళాశాలలో మంగళవారం బాలోత్సవం కమిటీ నాయ కులు బి.లక్ష్మీరాజ, బి.రాజశేఖర్‌ రాహుల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్‌ఎస్‌ఎ ప్రాజెక్టు ఆఫీసర్‌ అంబవరం ప్రభాకర్‌ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్‌ వీర సుదర్శన్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగివున్న సజనాత్మకతను వెలికి తీయటానికి ఇలాంటి చిత్రలేఖనం పోటీలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభ ను వెలికి తీయటానికి కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. అనంతరం సబ్‌ జూనియర్స్‌లో మొదటి బహుమతి టి. అన్విత వర్షిని, రెండవ బహుమతి ఎస్‌. సోఫియా, మూడో బహుమతి బి. సింధుజ రెడ్డి, జూనియర్స్‌ విభాగం నుంచి మొదటి బహుమతి ఎల్‌ వైష్ణవి, రెండో బహుమతి ఎం. భరద్వాజ, మూడో బహు మతి శ్రీకర్‌ సీనియర్స్‌ విభాగం నుంచి డి. సాయి యశస్విని, రెండో బహుమతి ఎన్‌.వి. శివ జ్యోతి, మూడో ప్రైజు ఎం. స్రవంతి, నలుగురికి స్పెషల్‌ ప్రైసులు 45 మందికి కన్సోలేషన్‌ బహుమతులు ప్రదానం చేశారు. చిత్రలేఖనం పోటీలు జయప్రదం కావడానికి సహకరించిన పాఠశాల యజమానులకు, విద్యార్థులు, తల్లిద ండ్రులకు కతజ్ఞతలు తెలిపారు. డిసెంబర్‌ లో ఒకటి నుంచి 10వ తరగతి చదివే ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రెండు రోజులు 10 విభాగాలలో కడప బాలోత్సవం ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో కడప బాలోత్సవం కన్వీనింగ్‌ కమిటీ సభ్యులు జి. గోపాల్‌, కె. నాగముణి రెడ్డి, బాల ఎల్లారెడ్డి, డాక్టర్‌ ఓబుల్‌ రెడ్డి, ఎస్‌. సునీత, ఆర్‌. ఉషా తులసి, ఏ. వెంకటేశ్వర్లు, ప్రసన్న, లక్ష్మి, పి.మహేష్‌ బాబు, బాల బయన్న, వెంకటేశ్వర్లు, శివ రాము, ఖరీం పాల్గొన్నారు.