
ప్రశంసా పత్రాలు చూపుతున్న విద్యార్థులు
- 7 బంగారు, 7 రజత పతకాలు కైవసం
ప్రజాశక్తి- సబ్బవరం
విజయవాడ డ్రీమ్ యంగ్ ఫైన్ ఆర్ట్స్ అకాడమీ వారు నిర్వహించిన చిత్రలేఖన పోటీల్లో మండలంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభను కనబర్చారు. నేషనల్ బాల చిత్రకళ అవార్డు, ఏడు బంగారు పతకాలు, ఏడు రజత పతకాలు సాధించారు. ఈ సందర్భంగా విజేతలను జిల్లా గురుకులాల సమన్వయ అధికారి ఎస్.రూపవతి, పాఠశాల ప్రిన్సిపాల్ కె.విజయకుమార్ శనివారం అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు ఆర్ట్స్‌లో ప్రతిభను కనబర్చడం అభినందనీయమని, భవిష్యత్‌లో రాణించాలని కోరారు. పతకాలు సాధించిన విద్యార్థుల ప్రతిభను ప్రశంసించి బహుమతులు అందజేశారు. శిక్షణ ఇచ్చిన ఆర్ట్స్ టీచర్ జి.అర్జునరావును ప్రత్యేకంగా అభినందించారు.