
చిత్రలేఖనం ఈ మాస పత్రికను ఆవిష్కరిస్తున్న అతిథులు
ప్రజాశక్తి- ములగాడ : ప్రముఖ చిత్రకారుడు, చిత్రకళోపాధ్యాయుడు డిఎస్.మనోహర్ సంపాదకత్వంలో రూపొందిన చిత్రలేఖనం ఈ మాసపత్రికను ఆదివారం మల్కాపురం శాఖా గ్రంథాలయంలో ప్రముఖ శిల్పి, చిత్రకారుడు టి.ప్రభాకరాచారి ఆవిష్కరించారు. నానాటికి ఆదరణ కోల్పోతున్న చిత్రకళారంగానికి ఈ పత్రిక ఎంతో ఉపకరిస్తుందని ఆచారి అన్నారు. చిత్రకళా పరిషత్ గౌరవాధ్యక్షులు జికెవి.రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సుంకర చలపతిరావు, సిఎస్.రాజు, శివ, బాలు, బుజ్జి, గ్రంథాలయాధికారి అజరుకుమార్ పొల్గొన్నారు.