ప్రజాశక్తి -సీలేరు
నర్సీపట్నం నుంచి జికె.వీధి మండలం సీలేరు వరకు కొన్ని సంవత్సరాలు నడుపుతున్న ప్రైవేటు మెయిల్ బస్సు సర్వీసును బుధవారం నుంచి ఆంధ్ర ఒడిశా సరిహద్దు చిత్రకొండ వరకు బస్సు యజమాని రాజు పొడిగించారు. దీనిపై సరిహద్దు ప్రాంత ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ బస్సు నర్సీపట్నంలో ప్రతిరోజు తెల్లవారుజామున 5 గంటలకు బయలుదేరి చింతపల్లి మీదగా సీలేరుకు 10.30 గంటలకు చేరుకొని తిరిగి, సీలేరులో 11 గంటలకు బయలుదేరి సాయంత్రం 4 గంటలకు నర్సీపట్నం చేరేది. ఈ బస్సు నర్సీపట్నం, లంబసింగి, చింతపల్లి, గూడెం, దారకొండ, సీలేరు వరకు ప్రయాణించే వారికి సౌకర్యవంతంగా ఉంది. ఈ బస్సుకు ఒడిశాలోని చిత్రకొండ వరకు రూట్ పర్మిట్ ఉంది. కొన్నాళ్లు పాటు దీనిని ఒడిశా సరిహద్దుకు తిప్పేవారు. చిత్రకొండ కాట్రగెడ్డ, పిల్లి గెడ్డ మీదగా సరిహద్దులోని ప్రధాని రహదారి వరకు బీటీ రోడ్డు ఆస్తవ్యస్తంగా ఉండడంతో తరుచూ మరమ్మతులకు గురి అవుతుండడంతో కొన్నాళ్ల క్రితం ఈ సర్వీసును సీలేరుకు కుదించారు. అయితే ఈ రహదారి గుండా మాచ్‌ఖండ్ జల విద్యుత్ కేంద్రానికి ఏపీ జెన్కో అధికారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో జెన్కో అధికారులు రహదారి సౌకర్యంపై తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులపై ఒత్తిడి తేచ్చారు. దీంతో కాట్రగెడ్డ వరకు ఆంధ్ర ప్రభుత్వం, అక్కడ నుంచి చిత్ర కొండ వరకు ఒడిశా ప్రభుత్వం రహదారి నిర్మాణం చేసింది. దీంతో సరిహద్దు ప్రజల విజ్ఞప్తి మేరకు ప్రైవేట్ మెయిల్ బస్సు సర్వీస్‌ను యజమాని రాజు చిత్ర కొండ వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ బస్సు నర్సీపట్నంలో ఉదయం 5 గంటలకు బయలు దేరి సీలేరు మీదుగా చిత్రకొండ వెళ్లి, తిరిగి సాయంత్రం 5 గంటలకు నర్సీపట్నం చేరకుంటుంది.










