పల్నాడు జిల్లా: ఈ నెల 2న పల్నాడు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన చిత్రకళ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ఆదివారం స్థానిక రావిపాడు రోడ్డులోని ఆక్స్‌ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ప్రాంగణంలో బహుమతుల ప్రదా నోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్ర కళా పోటీల కన్వీనర్, విశ్రాంత ఉపాధ్యాయులు కట్టా కోటేశ్వర రావు అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎంబివికె విజ్ఞాన కేంద్రం నిర్వాహకులు పిన్నమనేని మురళీ కృష్ణ మాట్లాడుతూ చిత్ర లేఖనం పోటీలకు విశేష స్పందన లభించిందని దీనికి సహకరించిన విజ్ఞాన కేంద్రం కమిటీ సభ్యులకు, చిత్ర లేఖనం పోటీల కన్వీనర్ కట్టా కోటేశ్వర రావు, మాజీ ప్రధానోపాధ్యాయుల సంఘం గౌరవ అధ్య క్షులు ఎం. ఎస్.ఆర్.కె ప్రసాద్‌లకు అభినందనలు తెలి పారు. రాష్ట్రంలో 50 విజ్ఞాన కేంద్రాలలో వారోత్సవాలు నిర్వహించేందుకు బాలోత్సవాల రాష్ట్ర కమిటీ తీర్మానం చేసిందని, డిసెంబర్ 2,3 తేదీలలో పల్నాడు విజ్ఞాన కేం ద్రంలో బాలోత్సవాలు నిర్వహించాలని స్థానిక కమిటీ సభ్యులకు సూచించారు. పల్నాడు విజ్ఞాన కేంద్రంలో జరుగనున్న బాలోత్సవాలకు కమిటీ గౌరవ అధ్యక్షులుగా ప్రధానోపాధ్యాయుల సంఘం మాజీ గౌరవ ప్రధాన అధ్యక్షులు ఎం ఎస్ ఆర్ కె ప్రసాద్, అధ్యక్షులుగా ఆక్స్ఫర్డ్ ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్ రాజారెడ్డి, కార్యదర్శిగా కట్టా కోటేశ్వరరావు, కార్యదర్శులుగా విజ్ఞాన కేంద్రం కార్య నిర్వాహక కన్వీనర్ మస్తాన్వలి,అనుముల లక్ష్మీశ్వరరెడ్డి, భాగేశ్వరిదేవిలు వ్యవహరిస్తారని చెప్పారు.
ఎమ్మెస్ ఆర్కే ప్రసాద్ మాట్లాడుతూ రానున్న రోజుల్లో కూడా విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. చిన్నారులు పుస్తక పఠనానికి దూర మవుతున్నారని సెల్‌ఫోన్, కంప్యూటర్,టివిలతో కాల క్షేపం చేస్తూ తోటి విద్యార్థులతో కుటుంబసభ్యులతో స్నేహ పూర్వక సంబంధాలను మర్చిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే పల్నాడు విజ్ఞాన కేంద్రాన్ని బహు ముఖ కళారూపాల ఆవిష్కరణకు పల్నాడు విజ్ఞాన కేం ద్రాన్ని వేదికగా చేయనున్నట్లు చెప్పారు.
విజ్ఞాన కేంద్రం కార్యనిర్వాహక కన్వీనర్ షేక్ మస్తాన్‌వలి కోశాధికారి, అనుముల లక్ష్మీశ్వరరెడ్డిలు మాట్లా డుతూ నేటి విద్యా విధానం కేవలం పరీక్షలు,ర్యాంకులు, చదువుల వరకే పరిమితం కావడంతో విద్యార్థుల్లో ఉన్న అనేక నైపుణ్యాలు వెలికి రాకుండా పోతున్నాయన్నారు. పల్నాడు విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో విద్యార్థులలో నైపుణ్యాలను వెలికి తీయటానికి, అభ్యుదయ భావాలను రేకెత్తించడానికి కృషి చేస్తుందని తెలిపారు. ఉత్తమ చిత్ర లేఖన విద్యార్థులకు 3 విభాగాలలో ప్రథమ,ద్వితీయ, తృతీయ బహుమతులు కింద 9 మందికి, ప్రతి విభాగంలో కన్సోలేషన్ బహుమతులు కింద 12 మంది చొప్పున 36 మందికి మొత్తం 45 మంది విద్యార్థులకు పల్నాడు విజ్ఞాన కేంద్రం ప్రశంసా పత్రం మెమోంటో, మెడల్‌తో సత్క రించారు. కార్యక్రమంలో ఆక్స్‌ఫర్డ్ ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్ రాజారెడ్డి, గాంధీ స్మారక సమితి వ్యవస్థాపకులు ఈదర గోపిచంద్, ప్రముఖ న్యాయవాది బి సలీం, ఉపాధ్యాయులు పచ్చవ బాలాజీ, బ్రహ్మయ్య, జోజిరెడ్డి, సెల్వరాజ్, హనుమయ్య, ప్రజా సంఘాల నాయకులు కామినేని రామారావు, డి.శివకుమారి,కోయ రామారావు, ఎస్.సి.ఈ.ఆర్.టి రిసోర్స్ పర్సన్ గౌస్ పాల్గొన్నారు.










