Aug 10,2023 20:53

చిరువ్యాపారుల జీవితాల్లో వెలుగులు

ప్రొద్దుటూరు : చిన్న చిల్లర కొట్టుపెట్టుకొని కుటుంబాన్ని పోషించుకుందామని ఓ పేదింటి యజమాని రూ.10వేలు అప్పు తెచ్చుకుంటే వడ్డీ వ్యాపారి రూ.1,500 పట్టుకొని రూ.8500 చేతుల్లో పెడ్తాడు. అడిగిన (తీసుకున్న) రూ.10వేలు ఆ వడ్డీ వ్యాపారికి 100 పని దినాల్లో చెల్లించాలి. ఇరుకు ఇబ్బం దిలెదురై సరిగా అప్పు చెల్లించకపోతే వడ్దీలకు వడ్డీలు పెంచి ఆ వ్యాపారి ఆర్థికంగా ఎదుగుతున్నాడు. చిరువ్యాపారి బక్కచిక్కిపోతున్నాడు. ప్రొద్దు టూ రులో వడ్డీవ్యాపారుస్తుల ఆగడాలపై పత్రికల్లో పలు కథనాలు వెలు వడ్డాయి. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో పేదల జీవితాల్లో వెలుగునింపుతోంది 'ఖిద్మత్‌ మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కో-ఆపరేటివ్‌ థ్రిఫ్ట్‌ అండ్‌ క్రెడిట్‌ సొసైటీ లిమిటెడ్‌. వడ్డీలేకుండా కేవలం తీసుకున్న అసలు మాత్రమే చెల్లించాలనే నిబంధనతో కులమతాలకతీతంగా చిన్నచిన్న వ్యాపారస్తులకు ఆర్థికంగా అండనిస్తోంది. గత జనవరి24న ప్రారంభించిన ఈ సహకార సొసైటీ నేటి వరకు 99 మందికి రూ.41,11,949 రుణాలిచ్చిందని సొసైటీ మేనేజర్‌ ఇంతి యాజుద్దీన్‌ తెలిపారు. ఎలెక్రీషియన్లు, ఇడ్లివడ అమ్ముకునేవారు, ఆటో కార్మికులు, సేకిల్‌షాపు యజమానులు, పంక్చర్‌ వేసేవాళ్లు, టైలరింగ్‌ చేసేవాళ్లు, స్వర్ణకార్మికులు ఇలా చిన్నచిన్న వ్యాపారస్తులు కనిష్టంగా రూ.5వేలు నుండి గరిష్టంగా రూ.50వేల వరకు రుణం తీసుకొని ఫీల్డ్‌ క్యాషి యర్ల ద్వారాప్రతిరోజు చెల్లింపులు చేస్తున్నారన్నారు. రూ.1లక్ష వరకు రోజువారీ ఆర్థికలావాదేవీలు జరుగుతున్నాయన్నారు. జిల్లా మేనేజింగ్‌ కమిటీ అధ్యక్షులు హుశేన్‌అహ్మద్‌ మాట్లాడుతూ ఇస్లాం నిబంధనల మేరకు వడ్డీ ఇవ్వడం, పుచ్చుకోవడం దోషం, నేరంగా భావించి నిరుపేదల జీవితాల్లో ఆశా కిరణం కావాలనే ఉద్దేశంతో సొసెటీని జిల్లాలో మొదటిసారిగా స్థాపిం చామ న్నారు. ఇలాంటి సొసైటీలు రాష్ట్రవ్యాప్తంగా 8 ఉన్నాయని తెలిపారు. వీటిలో నంద్యాలలోని సొసైటీ రోజువారీగా రూ.కోట ఆర్థిక లావా దేవీలతో ముం దుందన్నారు. ఆంధ్రరాష్ట్రంలో' ఖిద్మత'్‌ పేరుతో, కర్నాటకలో 'కారుణ్య' పేరుతో, తెలంగాణాలో 'సేవ' పేరుతో ఈ సొసైటీ సేవలం దిస్తోందన్నారు. హైదరాబాద్‌లో ఉన్న ప్రధాన కార్యాలయ పర్యవేక్షణలో ఈ మూడు రాష్ట్రాల లోని సొసైటీలు పనిచేస్తున్నాయన్నారు. ప్రొద్దుటూరు బ్రాంచ్‌ మేనేజింగ్‌ కమిటీ అధ్యక్షులు షేక్‌ సలీం మాట్లాడుతూ పేదప్రజలను జలగల్లా పీడిస్తున్న కార్పొరేషన్‌ వడ్డీల బారినుండి తప్పించేందుకు ఈ సొసైటీని స్థాపిం చామన్నారు. కష్టపడి సంపాదించిన సొమ్ము ఫైనాన్స్‌లకే సరిపోతోందనే చిరువ్యాపారస్తుల ఆవేదనలోంచి పుట్టిందే ఈ ఖిద్మత్‌ సొసైటీ అన్నారు.
జీవితం హాయిగా గడుస్తోంది ద్విచక్రవాహనాలు పెరిగిన ఈ రోజుల్లో చిన్న సైకిల్‌షాపుతో గడవడం కష్టంగా ఉండేది. సొసైటీలో రూ.50వేలు రుణం తీసుకొని గాలి మిషన్‌, మోటర్‌ సైకిళ్ల విడిభాగాలు తెచ్చుకొని రోజువారీ చెల్లింపులతో జీవితం హాయిగా గడుస్తోంది.
- హెచ్‌.చాంద్‌బాషా, సైకిల్‌ షాపు
రెండు సార్లు రుణం తీసుకున్నాను
రూ.50వేలు ప్రకారం రెండు సార్లు రుణం తీసుకున్నాను. తద్వారా బాడుగ ఆటో సొంతమైంది.దిగుల్లేకుండా జీవిసున్నాను. ఆర్థిక భారంలేకుండా కుటుంబాన్ని గడుపుతున్నాను.
- షేక్‌ కమాల్‌బాషా, ఆటో కార్మికుడు
రూ.20 వేలు రుణం తీసుకున్నా.
రూ.20వేలు అప్పు తీసుకున్నాను. ఎలక్ట్రికల్‌ షాపు పెట్టుకుని జీవిస్తున్నాను. ప్రతిరోజూ రూ.200 సొసైటీకి అప్పు చెల్లిస్తున్నాను. కష్టమనిపించడంలేదు. రుణం తీరిపోతా ఉంది.
- వి.యస్‌.చాంద్‌బాషా, ఎలక్ట్రీషియన్‌ప్రొద్దుటూరులోని ఖిద్మత్‌ కార్యాలయం