
ప్రజాశక్తి - భట్టిప్రోలు
గ్రామానికి చెందిన చిరు వ్యాపారి మురుమళ్ళ సావిత్రి (66) అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. గ్రామంలో సుపరిచితురాలైన ఈమె మృతి పట్ల పలువురు వ్యాపారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతురాలి కుమారుడు సత్యనారాయణ టిడిపి మండల కార్యదర్శిగా గతంలో పనిచేశారు. ప్రస్తుతం ఓ టీవీ ఛానల్ రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు. ఆమె మృతి సమాచారం తెలుసుకున్న మాజీ మంత్రి నక్కా ఆనందబాబు సావిత్రి ఇంటికి వెళ్లారు. ఆమె మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఆయనవెంట టిడిపి రాష్ట్ర కార్యదర్శి తూర్గుంట్ల సాయిబాబా, టిడిపి మండల కన్వీనర్ వాకా శేషుబాబు, మాజీ కన్వీనర్ ఎర్రంశెట్టి కరుణ శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ నాయకులు కనపర్తి సుందర్రావు, ఎడ్ల జయశీలరావు, బట్టు మల్లికార్జునరావు, సిరాజుద్దీన్ ఉన్నారు.