సబ్ కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న దైవప్రసాద్
ప్రజాశక్తి - ఆదోని
ఆదోని డివిజన్ పరిధిలోని కోసిగి గ్రామ పరిసరాల్లో సంచరిస్తున్న చిరుత పులులను సంరక్షించాలని వన్యప్రాణుల కార్యకర్తలు దైవ ప్రసాద్, మూర్తి, వెంకటేష్ కోరారు. శుక్రవారం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కోసిగి పరిసర కొండల్లో చిరుత పులుల సంచారం ఉన్నట్లు గత ఆరు నెలలుగా వార్తపత్రికల ద్వారా తెలుస్తోందన్నారు. ఆఫ్రికా దేశం నుంచి నాలుగు చిరుత పులులను దిగుమతి చేసుకున్న విషయం తెలిసిందేనని అన్నారు. కోసిగి పరిసర ప్రాంత కొండలు కొన్నింటిని చిరుత పులుల రక్షిత అడవులుగా ప్రకటించి వాటిని సంరక్షించాలని కోరారు.










