Aug 16,2023 21:58

పొలంలో మృతిచెందిన చిరుత

ప్రజాశక్తి మడకశిర : మండల పరిధిలోని మెళవాయి కొండ ప్రాంతంలోని పొలంలో చిరుత అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. మృతిచెందిన చిరుతను గమనించిన రైతులు అటవీశాఖాధికారులకు సమాచారం అందించారు. చిరుత మృతికి కారణాలు తెలపాల్సిన ఫారెస్ట్‌ అధికారులు సుమారు 12 గంటలు గడిచిన స్పందించలేదు. చిరుత మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విషప్రయోగం జరిగిందా , వేటగాళ్ల బారిన పడిందా, లేక అనారోగ్యంతో మృతిచెందిందా అన్న సమాచారాన్ని ఫారెస్ట్‌ అధికారులు ఇంతవరకు బహిర్గత పరచకపోవటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.