Sep 21,2023 20:41

సర్టిఫికెట్లు పొందిన విద్యార్థులతో డిప్యూటీ డిఇఒ, ఉపాధ్యాయులు

రాయచోటి : మంచి ఆరోగ్యం కోసం విద్యార్థి దశ నుండే చిరుధాన్యాల ఆహారాన్ని ఒక అలవాటుగా చేసుకోవాలని జిల్లా ఉప విద్యాశాఖాధికారి వరలక్ష్మి పేర్కొ న్నారు. ఆంధ్రప్రదేశ్‌ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ డైరెక్టర్‌ పిలుపుమేరకు డైట్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం జిల్లా సైన్స్‌ సెమినార్‌ను జిల్లా సైన్స్‌ అధికారి మార్లఓబుల్‌ రెడ్డి నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె 'చిరుధాన్యాలు మంచి పోషకాహారమా లేక ప్రీతికర ఆహారమా' అనే అంశంపై సైన్స్‌ సెమినార్‌ నిర్వహించారన్నారు. చిరుధాన్యాలను ఆహారంగా అలవాటు చేసుకుంటే వ్యాధులు దరి చేరవన్నారు. స్థూలకాయం, చక్కెర వ్యాధి, జీర్ణానాళ సమస్యలకు చిరుధాన్యాలు ఔషధం లాగా ఉపయోగపడతాయన్నారు. మంచి పోషకాహారంపై సమాజానికి అవగాహన కల్పించడానికి ఈ ఇతివత్తాన్ని ఎంపిక చేశామన్నారు. ఇదే అంశంపై మండల స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు విద్యార్థులకు సెమినార్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పలువురు విద్యార్థులు ఈ సెమినార్లో పాల్గొనగా మొలకలచెరువు మండలం బురకాయల కోటలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు చెందిన మానస సైన్స్‌ సెమినార్‌లో విశిష్ట ప్రతిభ కనబరచి జిల్లా మొదటి స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయికి ఎంపికైంది. రామాపురం మోడల్‌ స్కూల్‌ విద్యార్థి ఉమేహాని ద్వితీయ స్థానం, పీలేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి భానుశేఖర్‌రెడ్డి తతీయ స్థానం సాధించారు. వీరికి సర్టిఫికెట్లు, మెమెంటోలు బహుకరించారు. రాయచోటి ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలకు చెందిన అధ్యాపకులు విశ్వ ప్రసాద్‌, సుగుణ న్యాయ నిర్ణయా లుగా వ్యవహరించారు. కార్యక్రమంలో ఆప్‌ కాస్ట్‌ జిల్లా కన్వీనర్‌ రవీంద్రారెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నిర్మలాదేవి, భోగా వెంకటసుబ్బయ్య, కష్ణయ్య ఇతర సైన్స్‌ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.