చిరుధాన్యాలపై అవగాహన కల్పిస్తున్న సూపర్వైజర్ విజయకుమరి
చిరుధాన్యాలతో ఆరోగ్యం
ప్రజాశక్తి - ఆత్మకూర్
చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయని ఐసిడిఎస్ సూపర్వైజర్ విజరు కుమారి, నాగేశ్వరమ్మలు అన్నారు. గురువారం పోషణ్ పక్వాడ్ కార్యక్రమంలో భాగంగా ఆత్మకురు మండలంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలలో కార్యక్రమాలు నిర్వహించారు. గర్భిణులు, బాలింతలు, పిల్లల తల్లిదండ్రులు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు తమతమ కేంద్రాల పరిధిలో కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు చిరుధాన్యాల వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయన్న విషయాలను వారు వివరించారు.










