Oct 04,2023 21:29

మిల్లెట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు భూమిపూజ చేస్తున్న కలెక్టర్‌, ఎమ్మెల్యే

రాయచోటి : అనేక పోషక విలువలు కలిగిన చిరుధాన్యాలతో సమాజంలో ఆరోగ్య సిరి పెంపొందుతుందని కలెక్టర్‌ గిరీష అన్నారు. బుధవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుండి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలో మొత్తం రూ.2958.69 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఏడు పరిశ్రమల యూనిట్లు, 6 ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, 13 సెకండరీ మిల్లెట్స్‌ ప్రాసెసింగ్‌ యూనిట్స్‌కు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వర్చువల్‌గా ప్రారంభోత్సవం, భూమిపూజ శిలాఫలకాలను ఆవిష్కరించారు. జిల్లాకు సంబంధించి పీలేరు మండలం గూడరేవులపల్లిలో రూ.4.41 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేయనున్న సెకండరీ మిల్లెట్‌ ప్రాసెసింగ్‌ యూనిటుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి వర్చువల్‌గా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. రాయచోటి కలెక్టరేట్‌ లోని స్పందన హాల్లో జరిగిన ఈ వర్చువల్‌ కార్యక్రమంలో కలెక్టర్‌ గిరీష, పీలేరు శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ పంజం సుకుమార్‌ రెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి రవిచంద్రబాబు, జిల్లా పరిశ్రమల అధికారి నాగరాజులు పాల్గొన్నారు. వర్చువల్‌ కార్యక్రమం ముగిసిన అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ 2023 సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరముగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించిందన్నారు. పోషక విలువలు కలిగిన చిరుధాన్యాల పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వ అనేక ప్రోత్సాహకాలు ఇచ్చి రైతులను చిరుధాన్యాల సాగు పెంచే విధంగా ప్రోత్సాహం ఇస్తుందన్నారు. ఇందులో భాగంగానే నేడు పీలేరు నియోజకవర్గం గూడరేవులపల్లిలో రూ.4.41 కోట్ల అంచనా ఖర్చుతో సెకండరీ మిల్లెట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ కు ముఖ్యమంత్రి శిలాఫలకాన్ని ఆవిష్కరించారని చెప్పారు. ఈ ప్రతిపాదిత యూనిట్‌ యొక్క స్థాపిత సామర్థ్యం రోజుకు ఆరు టన్నులుగా ఉంటుందని, ఈ యూనిట్‌ ద్వారా దాదాపు 20 మందికి ప్రత్యక్షంగా ఉపాధి, పరోక్షంగా మరొక 2000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉందన్నారు. జిల్లాలో ఏర్పాటు చేస్తున్న ఈ సెకండరీ మిల్లెట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ద్వారా వివిధ రకాల చిరుధాన్యాల పిండి, గంజి, బేకింగ్‌ కుకీస్‌, మిల్లెట్‌ రేకులు, వెర్మిసెల్లి, నూడిల్స్‌, ఫోర్టిఫైడ్‌ మిల్లెట్‌ వంటి మంచి మార్కెట్‌ విలువ కలిగిన వివిధ ద్వితీయ ఉత్పత్తులను ప్రాసెస్‌ చేయడమే ఈ ప్లాంట్‌ యొక్క ముఖ్య లక్ష్యం అన్నారు. రైతులందరూ చిరుధాన్యాల సాగుపై ద ష్టి పెట్టి ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి క షి చేయాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. పీలేరు ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మన పూర్వీకుల ఆరోగ్యాన్ని, బలాన్ని పరిశీలిస్తే వారు కష్టపడి పని చేసేవారు, చిరుధాన్యాలను ఆహారంగా తీసుకునేవారని తెలిపారు. ప్రస్తుత కాలంలో శారీరక కష్టం తగ్గింది. అంతేకాక నాజుకు తిండి తినడం వల్ల అనారోగ్యం పాలవుతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న జనాభాతో పాటు ఆహారపు అవసరాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న వనరులు మారుతున్న వాతావరణ పరిస్థితులలో నాణ్యమైన పోషక విలువలు ఉన్న ఆహారాన్ని అందించాలన్న ప్రధాన ఉద్దేశంతో ముఖ్యమంత్రి చిరుధాన్యాల ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పడంపై దష్టి సారించి ఆ దిశగా చర్యలు తీసుకుని అమలు చేస్తున్నారు. పీలేరు నియోజకవర్గంలో చిరుధాన్యాల సాగు పెంపుకు కషి చేస్తున్నాం అన్నారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ పంజం సుకుమార్‌ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి చిరుధాన్యాలు ఎంతగానో తోడ్పడుతాయి వ్యవసాయం దాని అనుబంధ రంగాలను బలోపేతం చేయడానికి ఒక రైతు బిడ్డగా ముఖ్యమంత్రి నిరంతరం కషి చేస్తున్నారు పేర్కొన్నారు. అనంతరం పీలేరు మండలం గూడరేవులపల్లిలో రూ.4.41 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేయనున్న సెకండరీ మిల్లెట్‌ ప్రాసెసింగ్‌ యూనిటు శిలాఫలకాన్ని కలెక్టర్‌, ఎమ్మెల్యే, జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వివిధ పంటలకు రైతులకు అందిస్తున్న మద్దతు ధర ప్రచార పోస్టులను ఆవిష్కరించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడి చంద్ర నాయక్‌, జిల్లా మార్కెట్‌ కమిటీ అధికారి త్యాగరాజు, వివిధ శాఖల జిల్లా అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.