Apr 04,2023 00:58
ముప్పవరంలో పోషణ్‌ పక్వాడ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు

ప్రజాశక్తి-పంగులూరు: చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహారంలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయని, అలాంటి ఆహారాన్ని తీసుకోవడం ద్వారా పిల్లలు, గర్భిణులు, బాలింతలు, ఆరోగ్యంగా ఉండవచ్చని ఐసిడిఎస్‌ కొరిశపాడు ప్రాజెక్టు సిడిపిఓ కృష్ణకుమారి అన్నారు. సోమవారం ముప్పవరం గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో జరిగిన, పోషణ పక్వాడ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాగులు, కొర్రలు, సజ్జలు, మొదలైన చిరుధాన్యాలు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగమని, వీటితో తయారుచేసిన ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చని ఆమె చెప్పారు.
చిరుధాన్యాలతో ఆహార పదార్థాలు ఎలా తయారు చేసుకోవచ్చో ఆమె అంగన్‌వాడీలకు, బాలింతలకు, గర్భిణులకు తెలియజేశారు. పోషణ్‌ పక్వాడా కార్యక్రమం ద్వారా, అంగన్‌వాడీలు అనేక రకాల ఆహార పదార్థాలు తయారు చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్‌వైజర్లు పద్మావతి, పద్మజ, ఇందిరమ్మ, ముప్పవరం అంగన్‌వాడీ టీచర్లు శ్రీలక్ష్మి, సుధారాణి, ప్రసన్న కుమారి, శ్యామల, సుజాత తదితరులు పాల్గొన్నారు.