ప్రజాశక్తి-కె.కోటపాడు
ఈ ఏడాది అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రభుత్వం ప్రకటించినందున రైతులు ఎక్కువగా చిరుధాన్యాల సాగు చేపట్టాలని వ్యవసాయ శాఖ ప్రత్యేక అధికారి మధు తెలిపారు. మంగళవారం వారాడ గ్రామంలో ఏర్పాటు చేసిన పొలంబడి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సేంద్రీయ వ్యవసాయ పద్ధతులతో సాగు చేస్తున్న పంటలను జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మోహన్ రావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి నిర్వహించారు. అపరాల పొలంబడి, వేరుశనగ పొలంబడిని పరిశీలించి పలు సూచనలు చేశారు. పెసర, మినుము తదితర అపరాలు పూత దశలో ఉన్నాయని. ఈ సమయంలో ఒక తడి ఇవ్వాలన్నారు. 20 లీటర్ల నీటిలో 100 గ్రాముల యూరియా కలిపి పిచికారి చేస్తే పూత బాగా వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు రవీంద్రనాథ్, ఏడిఏ వసంతకుమారి, పొలంబడి కోఆర్డినేటర్ చిరంజీవి, ఏవో సోమశేఖర్, వ్యవసాయ శాఖ సహాయకులు పాల్గొన్నారు.










