Aug 18,2023 21:39

మాట్లాడుత్ను పంజం సుకుమార్‌రెడ్డి

జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ పంజం సుకుమార్‌రెడ్డి
రాయచోటి
జిల్లాలో చిరుధాన్యాల ఉత్పత్తి, విస్తీర్ణం గణనీయంగా పెంచి, వీటి సాగును ప్రోత్సహించాలని వ్యవసాయ అధికారులను జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ పంజం సుకుమార్‌ రెడ్డి సూచించారు. శుక్రవారం రాయచోటి కలెక్టరేట్‌లోని స్పందన హాలులో జిల్లా వ్యవసాయ సలహా మండలి బోర్డు చైర్మన్‌ అధ్యక్షతన జిల్లా వ్యవసాయ సలహా మండలి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలని, వర్షభావ పరిస్థితుల్లో ఇస్తున్నటువంటి ప్రత్యామ్నాయ విత్తనాలలో చిరుధాన్యాలకు ప్రాధాన్యత కల్పించి సాగును పెంచాలని అధికారులకు సూచించారు. విత్తనాలు, పురుగుమందులు సకాలంలో రైతులకు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సలహా మండలి సమావేశంలో లేవనెత్తిన సమస్యలన్నీ అధికారులు నోట్‌ చేసుకొని ఎప్పటికప్పుడూ సంప్రదిస్తూ రైతుల సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు విస్తత సేవలు అందివ్వాలన్నారు. ఖరీఫ్‌ సీజన్‌లో సాగుకు అవసరమైన అన్నిరకాల నాణ్యమైన ఎరువులు, విత్తనాలను రైతుభరోసా కేంద్రాల్లో రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి బి. చంద్ర నాయక్‌ మాట్లాడుతూ జిల్లాలో వేరుశనగ అక్కడక్కడ వాడుతుందని, రైతులు అప్రమత్తంగా ఉండి 2 శాతం యూరియా ద్రావణాన్ని పిచికారి చేసుకున్నట్లయితే కొన్ని రోజుల వరకు పంట వాడకుండా కాపాడుకోవచ్చని తెలిపారు. జిల్లాలో కౌలుదారు పత్రాలు గణనీయంగా ఇచ్చారని, వీరందరికీ బ్యాంకుల ద్వారా నుంచి ఇప్పించే విధంగా అధికారులు కషి చేయాలని, వీటికి బ్యాంకు వారు కూడా సహకరించాలని ఎల్‌డిఎంను జిల్లా వ్యవసాయ అధికారి కోరారు. అందులో భాగంగా జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను అధికారుల దష్టికి తీసుకువచ్చారు. కార్యక్రమంలో వ్యవసాయ సలహాలు సభ్యులు భోదేశావళి, జిల్లా స్థాయి అధికారులు, సహాయ వ్యవసాయ సంచాలకులు పాల్గొన్నారు