Nov 14,2023 21:23

చిరుధాన్యాల సాగుపై రైతులు, అధికారులతో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌

      బొమ్మనహాల్‌ : చిరుధాన్యాల సాగు విస్తీర్ణం రెండింతలు పెంచాలనే రైతులకు మరింత ప్రోత్సాహం అందించాలని జాయింట్‌ కలెక్టర్‌ కేతన్‌ గార్గ్‌ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. మంగళవారం నాడు మండల పరిధిలోని కురువళ్లి గ్రామంలో మద్దతు ధరతో చిరుధాన్యాల సేకరింపుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుభరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో చిరుధాన్యాలను సేకరణ చేయాలన్నారు. రాగి, కొర్ర, సజ్జ, జొన్న లాంటి చిరుధాన్యాలకు సంబంధించి మద్దతు ధర కల్పిస్తున్నట్లు చెప్పారు. మండలంలో చిరుధాన్యాల సాగుకు సంబంధించి ఇప్పుడున్న విస్తీర్ణాన్ని రెండింతలు పెంచాలన్నారు. డిసెంబర్లో పంట కోతకు వచ్చే వరి పంటను కూడా మద్దతు ధరతో సేకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఎఇఒ గోపాల్‌, రైతులు పాల్గొన్నారు.