రాయచోటి : రాష్ట్రంలోని చిరువ్యాపారులు, సంప్రదాయ వత్తుల వారికి 'జగనన్న తోడు' పథకం బాసటగా నిలుస్తోందని కలెక్టర్ గిరీషా పీఎస్ తెలి పారు. జగనన్న తోడు 7వ విడతలో భాగంగా చిరు వ్యాపారులకు వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లె క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేసే కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. రాయచోటి కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్సు హాలులో కలెక్టర్, జెసి ఫర్మన్ అహ్మద్, డిఆర్‌డిఎ పీడీ సత్యనారాయణ, గ్రామ, వార్డు సచివాలయ జిల్లా అధికారి మనోహర్‌రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న తోడు పథకం 7వ విడతలో జిల్లాలో మొత్తం 17,146 మంది లబ్ధిదారులకు రూ.1846.5 లక్షలు జమ చేశారని చెప్పార. ఈ పథకం ద్వారా రుణాలు పొంది సకాలంలో చెల్లించిన 14, 648 మందికి రూ.30.345 లక్షలు వడ్డీ రీయింబర్స్‌మెంట్ కింద లబ్ధిదారుల ఖాతాలో జమ చేశామన్నారు. ప్రభుత్వం చిరు వ్యాపారులకు ఎల్లవేళలా అండగా ఉంటుందన్నారు. తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లించి నట్లయితే తిరిగి వడ్డీ లేని రుణాలు పొందవచ్చునన్నారు. వీధి వ్యాపారులకు బాసటగా నిలుస్తున్న జగనన్నతోడు పథకాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. చిరు వ్యాపారులకు రూ.10 వేలు వడ్డీ లేని రుణాలు ఇవ్వడంతో మహిళల ముఖంలో చిరునవ్వులు కనిపిస్తున్నాయని తెలిపారు. ఈ డబ్బును అనవసరాలకు ఉపయోగించకుండా తీసుకున్న అవసరాలకు మాత్రమే ఖర్చు చేసి ఆర్థికాభివద్ధి చెందాలన్నారు. అనంతరం లబ్ధిదారులకు మెగాచెక్కును కలెక్టర్ అందజేశారు.










