ప్రజాశక్తి-మార్టూరు రూరల్: రోటరీ అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకొని చిరు వ్యాపారులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని రోటరీ క్లబ్ ఆఫ్ మార్టూరు అధ్యక్ష కార్యదర్శులు కొర్రపాటి కాజారావు, కుర్రా వెంకటరామయ్య పిలుపు ఇచ్చారు. ఆదివారం స్థానిక ఎఫర్ట్ కార్యాలయం ఆవరణలో రోటరీ క్లబ్ ఆఫ్ డెక్కన్ హైదరాబాద్, రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వారి సహకారంతో రోటరీ క్లబ్ ఆఫ్ మార్టూరు ఆధ్వర్యంలో చిరు వ్యాపారుల ఆర్థిక స్వావలంబన కోసం రోటరీ చేయూత చక్రాల పథకం కింద 8 మందికి తోపుడు బండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ ఎగ్జిక్యూటివ్ కార్యదర్శి జాస్టి వెంకట మోహనరావు, 2023-24 ఎలక్ట్ అసిస్టెంట్ గవర్నర్ ఇంటూరి ఆంజనేయులు. మాజీ అధ్యక్షులు సిహెచ్ బసవ రాములు, జాష్టి సాంబశివరావు, రావి అంకమ్మ చౌదరి, కాజా హుస్సేన్, మురకొండ ఈశ్వర ప్రసాద్, గుండవరపు ప్రసాద్, చెరుకూరి నాగేశ్వరరావు, జి వెంకటేశ్వరరావు, కందిమళ్ల రవిబాబు, చింతల సుబ్బారావు, గాలి గంగాధర్, రోటరీ సభ్యులు పాల్గొన్నారు.










