Mar 01,2023 00:27
చిరు వ్యాపారులకు తోపుడుబళ్లు అందిస్తున్న రోటరీ సభ్యులు

ప్రజాశక్తి-బాపట్ల: రోటరీ క్లబ్‌ ద్వారా అనేక సేవా కార్యక్రమాలతో పాటు నిరుపేదలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తమవంతు చేయూతనిస్తుందని రోటరీ క్లబ్‌ ఆఫ్‌ బాపట్ల అధ్యక్షులు మోరిశెట్టి సుధీర్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం రోటరీ క్లబ్‌ ఆఫ్‌ బాపట్ల ఆధ్వర్యంలో రోటరీ క్లబ్‌ ఆఫ్‌ మంగళగిరి, రోటరీ క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ డక్కన్‌ సహకారంతో తోపుడు బళ్లు అందజేసినట్లు సుధీర్‌ కుమార్‌ తెలిపారు. బాపట్లకు చెందిన ఇనకొల్లు వెంకటేశ్వర్లు (ఇస్త్రీ బండి), దేవిరెడ్డి మార్కండేయులు (అరటిపళ్ల వ్యాపారం), పీతా ఆంజనేయులు (చేపలు వ్యాపారం)నకు తోపుడు బళ్లను అందజేశారు. కోళ్లపూడి ఉపేంద్రగుప్తా, ఏలూరి హరిబాబు, బూర్లె రామసుబ్బారావు, జిట్టా శ్రీనివాసరావు, కొల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు.