చిరు ధాన్యాలతో రక్తహీనత నివారణ
ప్రజాశక్తి - వెలుగోడు
చిరు ధాన్యాలతో రక్తహీనతను నివారిద్దాం అని ఐసిడిఎస్ సూపర్వైజర్ సూర్య కుమారి అన్నారు. సోమవారం మండల పరిధిలోని వెల్పనూరు గ్రామంలో స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్ నందు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ పక్వాడా కార్యక్రమం తరుపున చిరుధాన్యాల ప్రాముఖ్యత, రక్తహీనత నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ డి.పి.సూర్య కుమారి చిరుధాన్యాలు, రక్తహీనతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, మహిళా పోలీసులు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు, స్కూల్ ప్రిన్సిపాల్ నాగమణ, టీచర్ లింగన్న, తదితరులు పాల్గొన్నారు. పాములపాడు: చిరుధాన్యాలలో పోషకాలు ఉండడంతో చిన్నారులకు ఎదుగుదల ఉంటుందని ఐసిడిఎస్ వేంపెంట సెక్టార్ సూపర్వైజర్ అంజలీదేవి అన్నారు. మండలంలోని భానుముక్కల గ్రామంలో పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా ఎంపీ యూపీ స్కూల్ నందు చిరుధాన్యాల ప్రదర్శన నిర్వహించి, వాటి ఉపయోగాలపై అవగాహన కల్పించారు. గర్భిణులు, బాలింతలు చిరుధాన్యాలు తీసుకుంటే ఆరోగ్యం పదిలంగా ఉంటుందన్నారు. రక్తహీనతను అధిగమిస్తారన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యా యురాలు వినీల రాణి, ఏఎన్‌ఎం కృష్ణవేణి, అంగన్వాడి టీచర్లు స్వాతి, మునెమ్మ, ఆశ వర్కర్ కవిత, తదితరులు పాల్గొన్నారు. ఆత్మకూర్ : మండలంలోని వెంకటాపురం ఉన్నత పాఠశాల జిల్లా పాఠశాల నందు పోషణ పక్వాడ కార్యక్రమం భాగంగా కిశోర బాలికలకు చిరుధాన్యాలపై అవగాహన కల్పించారు. బైర్లుటి పిహెచ్‌సి డాక్టర్ గోపాల్ పాల్గొని బాలికలకు చిరుధాన్యాలు గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శాహనాజ్ బేగం, వెంకటాపురం, కృష్ణాపురం, అంగన్వాడీ కార్యకర్తలు, కవిత, శివలింగమ్మ, మేరీ మణి కుమారి, బుజ్జి, కళావతి, ఆదిలక్ష్మి, విజయమ్మ తదితరులు పాల్గొన్నారు.










