Sep 02,2023 22:16

వర్థంతి కార్యక్రమాల్లో వక్తలు
ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం

వైఎస్‌ఆర్‌ హయాంలోనే రాష్ట్రం సుభిక్షంగా మారిందని ఉప ముఖ్యమంత్రి, దేవదాయ ధర్మదాయ శాఖ కొట్టు సత్యనారాయణ అన్నారు. కీర్తిశ షులు వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి వర్థంతి సంద ర్భంగా మంత్రి కార్యాలయంలో వైఎస్‌ఆర్‌ చిత్రపటానికి, అనంతరం స్థానిక ఓవర్‌ బ్రిడ్జి సెంటర్‌లో వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల మనసు గెలిచిన మహనీయుడు డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి అని కొనియా డారు. ఆయన మరణం రాష్ట్రానికే కాదు దేశానికి తీరని లోటన్నారు. అనంతరం స్థానిక ఆర్‌టిసి బస్టాండ్‌ వద్ద వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యులు ముత్యాల ఆంజనేయులు, పట్టణ కన్వీనర్‌ ధర్మరాజు పాల్గొన్నారు.
నరసాపురం టౌన్‌ : మండలంలోని ధర్బరేవు గ్రామంలో, పట్టణంలోని చీఫ్‌ విప్‌ క్యాంపు కార్యాలయంలో, స్టీమర్‌ రోడ్డులో, మున్సిపల్‌ కార్యాలయంలో ఉన్న వైఎస్‌ఆర్‌ విగ్రహాలకు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ముదునూరి ప్రసాదరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్‌ కార్యాలయంలో నూతనంగా నిర్మించిన పార్క్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ మరణించి 14 ఏళ్ళైనా ప్రజల గుండెల్లో ఇంకా జీవించే ఉన్నారన్నారు. ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌ ఛైర్మన్‌ గుబ్బల రాధాకృష్ణ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వెంకటరమణ, వైస్‌ చైర్‌ పర్సన్‌ కామన నాగిని, వైస్‌ ఛైర్మన్‌ కొత్తపల్లి భుజంగరాయుడు, జెడ్‌పిటిసి సభ్యులు బొక్క రాధాకృష్ణ, తిరుమని బాపూజీ పాల్గొన్నారు.
గణపవరం :మాజీ ముఖ్యమంత్రి, కీర్తిశేషులు వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి రెడ్డి ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఉంగుటూరు ఎంఎల్‌ఎ పుప్పాల శ్రీనివాసరావు (వాసుబాబు) అన్నారు. రాజశేఖర్‌రెడ్డి వర్థంతి సందర్భంగా శనివారం స్థానిక రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్‌ అధ్యక్షులు దండు వెంకట రామరాజు, సర్పంచి మూరా అలంకారం, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు గాదిరాజు వెంకట సుబ్బరాజు(పెదబాబు), సూర్య బలిజ రాష్ట్ర కార్పొరేషన్‌ ఛైర్మన్‌ శెట్టి అనంతలక్ష్మి పాల్గొన్నారు.
ఉండి : వైసిపి ఉండి గ్రామ అధ్యక్షుడు కరిమెరక మల్లికార్జునరావు ఆధ్వర్యంలో ఉండి పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఉన్న వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి విగ్రహం వద్ద నిర్వహించిన వర్థంతి కార్యక్రమంలో ఎంపిపి ఇందుకూరి శ్రీహరినారాయణ రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏడిద వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం మిఠాయిలు, పండ్లు పంచిపెట్టారు. ఈ కార్యక్ర మంలో క్రిస్టియన్‌ మైనారిటీ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ కొర్రపాటి అనిత, గ్రామ సర్పంచి కమతం సౌజన్య బెనర్జీ, రణస్థుల మహంకాళి, గుండాబత్తుల సుబ్బారావు, కరిమెరక శివనాగ రాజు, బడుగు బాలాజీ, శేషాద్రి శ్రీని వాస్‌, అందుకూరి రాజు, రాయి సతీష్‌, మల్లువలస సత్యనారాయణ, గెద్ద రవికుమార్‌, షేక్‌ కన్నా సాహెబ్‌ పాల్గొన్నారు.
పాలకోడేరు : మండలంలోని విస్సాకోడేరు రావిచెట్టు సెంటర్‌లో వైఎస్‌ఆర్‌ విగ్రహానికి ఎంపిపి భూపతిరాజు సత్యనారాయణరాజు (చంటిరాజు), సర్పంచి బొల్ల శ్రీనివాస్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కో-ఆప్షన్‌ సభ్యురాలు డాక్టర్‌ డిఆర్‌.స్వర్ణలత, ఎంపిటిసి సభ్యులు గాంధీ, సొసైటీ ఛైర్మన్‌ గెడ్డం జోషి పాల్గొన్నారు. గొల్లలకోడేరులో పార్టీ గ్రామ అధ్యక్షులు చేకూరి రాజానరేంద్ర వర్మ, కోరుకొల్లులో రాష్ట్ర అటవీ సంస్థ డైరెక్టర్‌, తణుకు నియోజకవర్గ పరిశీలకులు మంతెన యోగేంద్ర కుమార్‌ (బాబు) రాజశేఖర్‌ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కోరుకొల్లు, మైప గ్రామాల్లో నూతనంగా మంజూరైన 32 పెన్షన్లను అందించారు. తడి, పొడి చెత్త వేసుకునే డబ్బాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచి ఆంజనేయరాజు, తిరుపతిరాజు పాల్గొన్నారు.
వీరవాసరం : మండలంలోని నవుడూరులో ఎంఎల్‌సి కవురు శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో, వీరవాసరంలో పట్టణ అధ్యక్షుడు నూకల కనకారావు ఆధ్వర్యంలో, రాయకుదురు గెడ్డం భాస్కరావు ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో వీరవాసరం వ్యవసాయ సలహమండలి ఛైర్మన్‌ గొలగాని సత్యనారాయణ, సర్పంచులు చికిలే మంగతాయారు, నల్లిమిల్లి వేణుక, వైసిపి నాయకులు మానుకొండ ప్రదీప్‌కుమార్‌ పాల్గొన్నారు.
పాలకొల్లు : గాంధీ బొమ్మ సెంటర్‌ వద్ద వైఎస్‌ఆర్‌ విగ్రహానికి వైసిపి పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌ఛార్జి గుడాల గోపి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు, స్థానిక 24, 25 వార్డుల్లో పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌సి కమిషన్‌ మెంబర్‌ ఆనందప్రకాష్‌, గుణ్ణం నాగబాబు, యడ్ల తాతాజీ, చందక సత్తిబాబు, కర్రా జయసరిత, చంద్రకళ పాల్గొన్నారు.
కాళ్ల : పెదఅమిరంలో పేదలకు డిసిసిబి ఛైర్మన్‌, వైసిపి ఉండి నియోజకవర్గ ఇన్‌ఛార్జి పివిఎల్‌. నరసింహరాజు చేతులమీదుగా 150 మందికి దుస్తులు, పండ్లు పంపిణీ చేశారు. సర్పంచి డొక్కు సోమేశ్వరరావు ఆర్థిక సహకారంతో పేదలకు దుస్తులు, యాపిల్స్‌ అందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచి జవ్వాది లీలా కిషోర్‌, టిటిడి మాజీ సభ్యుడు గోకరాజు రామరాజు, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పాతపాటి వెంకట శ్రీనివాసరాజు(వాసు), ఎంపిపి పి.శిరీష విశ్వనాథరాజు, మండల కో ఆప్షన్‌ సభ్యుడు జార్జ్‌ బెనర్‌ పాల్గొన్నారు.
పోడూరు : తూర్పుపాలెంలోని ఎంఎల్‌ఎ చెరుకువాడ శ్రీరంగనాథరాజు క్యాంపు కార్యాలయంలో వైఎస్‌ఆర్‌ వర్థంతి కార్యక్రమం నిర్వహించారు. శ్రీరంగనాథరాజు ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొత్తగా మంజూరైన పింఛన్లను పెన్షన్‌దారులకు అందించారు. ఈ కార్యక్రమంలో జెడ్‌పిటిసి సభ్యులు గుంటురి పెద్దిరాజు, కర్రి వెంకటరెడ్డి, ఎఎంసి ఛైర్మన్‌ సిల్లే లావణ్య, ఎంపిపి సుమంగళి పాల్గొన్నారు.
మొగల్తూరు : వైసిపి గ్రామ అధ్యక్షుడు కుక్కల కృష్ణమోహన్‌ ఆధ్వర్యంలో స్థానిక పంచాయతీ కార్యాలయం సమీపంలో ఉన్న వైఎస్‌ఆర్‌ విగ్రహానికి అభిమానులు పూలమాల వేసి నివాళులర్పించారు. సర్పంచి పడవల మేరీ సత్యనారాయణ, ఉప సర్పంచి బోణం నరసింహరావు, సంకు రాము, చిక్కాల చిన్న, ి దొరబాబు, గురూజీ చిన్ని, చంటి పాల్గొన్నారు.
ఆచంట : నియోజకవర్గ కేంద్రమైన ఆచంటలో నిర్వహించిన వైఎస్‌ఆర్‌ వర్థంతి కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర కార్యదర్శి వైట్ల కిషోర్‌కుమార్‌ పాల్గొని మాట్లాడారు. అనంతరం పేదలకు పండ్లు, రొట్టెలు అందించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని ఆచంట, కొడమంచిలి, పెనుమంచిలి, ఆచంట వేమవరం, వల్లూరు పలు గ్రామాల్లో వైఎస్‌ఆర్‌ వర్థంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఆసుపత్రిలో రోగులకు పండ్లు అందించారు. ఈ కార్యక్రమంలో ఎఎంసి ఛైర్మన్‌ చిల్లే లావణ్య, గ్రామాల సర్పంచులు కోట సరోజినీ వెంకటేశ్వరరావు, సుంకర సీతారాం, జక్కంశెట్టి చంటి, సుబ్బారావు పాల్గొన్నారు.