Jul 08,2023 19:24

చిప్పగిరిలో రోగులకు, అనాథలకు పండ్లు, బ్రెడ్లు, పాలు అందజేస్తున్న వైసిపి నాయకులు

ప్రజాశక్తి - చిప్పగిరి
నిరుపేదలను అక్కున చేర్చుకొని వారికేం కావాలో ఆలోచించి, అనేక సంక్షేమ పథకాలు అందించిన చిరస్మరణీయుడు వైఎస్‌ఆర్‌ అని ఆలూరు మార్కెట్‌ యార్డు ఛైర్మన్‌ గుమ్మనూరు నారాయణ, చిప్పగిరి సర్పంచి గోవిందరాజులు, వైసిపి కన్వీనర్‌ రంగస్వామి తెలిపారు. శనివారం కీర్తిశేషులు వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచులు గోవిందరాజులు, రమాదేవి, సావిత్రి, లక్ష్మీదేవమ్మ, వైస్‌ ఎంపిపి పద్మావతి భారీ కేక్‌ కట్‌ చేశారు. అనంతరం చిప్పగిరి ఆస్పత్రిలో రోగులకు, బంబం స్వామి దర్గా దగ్గర ఉన్న అనాథలకు బ్రెడ్లు, పాలు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడారు. వైఎస్‌ఆర్‌ ఆదర్శంగా తీసుకొని జగన్మోహన్‌ రెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరామ్‌ సలహాల మేరకు ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందిస్తామని తెలిపారు. వైసిపి సీనియర్‌ నాయకులు ధర్మేంద్ర, రాజన్న, శ్రీధర్‌, షేకన్న, బెల్డోన గోవిందు, భాస్కర్‌, సతీష్‌, రమేష్‌, పరమేష్‌, నాగరాజు, గోవర్ధన, అజరు, నారి, వెంకటేష్‌, తిరుమలేష్‌ పాల్గొన్నారు. అలాగే ఉమ్మడి జిల్లాల పంచాయతీరాజ్‌ వింగ్‌ అధ్యక్షులు, జడ్‌పిటిసి విరుపాక్షి ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి వేడుకలు నిర్వహించారు. చిప్పగిరి ప్రాథమిక పాఠశాలలో నిరుపేదలకు గుండెకు సంబంధించిన ఉచిత మెడికల్‌ శిబిరం నిర్వహించారు. విరుపాక్షి మాట్లాడుతూ... ఆరోగ్యశ్రీ సృష్టికర్త రాజశేఖర్‌ రెడ్డి అని, ఆయనను ఆదర్శంగా తీసుకొని ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎంపిటిసి సుంకన్న, వైసిపి నాయకులు నాగప్ప, ఓబులేసు, మల్లికార్జున, లోకనాథ్‌, సేనాపతి, జిల్లా వాల్మీకి అధ్యక్షులు రామాంజనేయులు పాల్గొన్నారు. ఆస్పరిలోని జగనన్న కాలనీలో వైసిపి మండల కన్వీనర్‌ పెద్దయ్య ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంచిపెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు. స్థానిక ప్రభుత్వాస్పత్రిలో రోగులు, బాలింతలు, వృద్ధులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. రైతు దినోత్సవం సందర్భంగా స్థానిక ఆర్‌బికెలో వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిఎం సందేశాన్ని వీక్షించి ఆర్‌బికె ఆవరణంలో మేజర్‌ పంచాయతీ సర్పంచి మూలింటి రాధమ్మ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. సొసైటీ ఛైర్మన్‌ గోవర్ధన్‌, జడ్‌పిటిసి దొరబాబు, మండల మాజీ కన్వీనర్‌ రామాంజనేయులు, మండల జెసిఎస్‌ కన్వీనర్‌ బసవరాజు, సొసైటీ సిఇఒ అశోక్‌, ముత్తుకూరు, చిన్నహోతూరు సర్పంచులు తోయజాక్షప్ప, హరికృష్ణ, ఎంపిటిసి రాధాకృష్ణ, వైసిపి నాయకులు తిమ్మప్ప, ప్రకాష్‌, రాజన్న గౌడ్‌, హార్టికల్చర్‌ అసిస్టెంట్‌ అనిల్‌ నాయుడు పాల్గొన్నారు. ఆదోనిలోని ఆర్‌ఆర్‌ లేబర్‌ కాలనీ వద్ద వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జీ దేవిశెట్టి ప్రకాష్‌ మాట్లాడారు. రైతు రుణమాఫీ, ఉచిత కరెంటు, ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్‌, ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని కొనియాడారు. జిల్లా ఎస్సీ సెల్‌ ప్రధాన కార్యదర్శి బి.తాయన్న, ఉపాధ్యక్షులు హుస్సేన్‌ బాష, యువజన కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు ఖలందర్‌, మండల అధ్యక్షులు నెట్టేకల్‌ హనుమంతు, నాగరాజు, రాజశేఖర్‌, రాజు స్వామి పాల్గొన్నారు. దేవనకొండ మండలంలోని తెర్నేకల్‌ గ్రామంలో వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి, కేక్‌ కట్‌ చేశారు. గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వైసిపి రాష్ట్ర నాయకులు తెర్నేకల్‌ సురేందర్‌ రెడ్డి హాజరయ్యారు. సర్పంచి అరుణ్‌ కుమార్‌, మండల కన్వీనర్‌ మల్లికార్జున, కెడిసిసి మాజీ డైరెక్టర్‌ దాసరి లుమాంబ, ఎంపిటిసి నామాల శ్రీనివాసులు, వైసిపి సీనియర్‌ నాయకులు మధుసూదన్‌ రెడ్డి, శేషాద్రి రెడ్డి, మాజీ ఎంపిటిసిలు చాప ఈరన్న, వాల్మీకి రాఘవేంద్ర, పులి నరేష్‌ పాల్గొన్నారు.
గ్రూపు విభేదాల నడుమ జయంతి వేడుకలు : దేవనకొండ గ్రామంలో వైఎస్‌ఆర్‌ జయంతి వేడుకలు వైసిపి నాయకుల గ్రూపు విభేదాల నడుమ జరిగాయి. ముందుగా కప్పట్రాళ్ల బొజ్జమ్మ, ఆమె భర్త, మాజీ ఎంపిపి రామచంద్ర నాయుడు, ఎంపిటిసి తపాల శ్రీనివాసులు వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి కేక్‌ కట్‌ చేశారు. కొంతసేపటికి జడ్‌పిటిసి కిట్టు, ఎంపిపి భర్త లుమాంబ, వైసిపి మండల కన్వీనర్‌ మల్లికార్జున, నాయకులు రాజారెడ్డి, దివాకర్‌ నాయుడు, ప్రేమనాథరెడ్డి, వెలమకూరు రామచంద్ర ఆధ్వర్యంలో పూలమాల వేసి కేక్‌ కట్‌ చేశారు. మండలంలో వైసిపి నాయకుల మధ్య గ్రూపు విభేదాలు స్పష్టంగా బయటపడ్డాయని పలువురు చర్చించుకుంటున్నారు.

చిప్పగిరిలో ఉచిత వైద్య శిబిరాన్ని పరిశీలిస్తున్న జడ్‌పిటిసి విరుపాక్షి