Sep 22,2023 00:54

ప్రజశక్తి - చీరాల
మహాకవి గురజాడ అప్పారావు జయంతి వేడుకలను జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కేజి ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించారు. గురజాడ సేవలు ఏనలేనివని అన్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జెవివి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుర్ర రామారావు, జిల్లా ఉపాధ్యక్షులు బండి బిక్షాలుబాబు, బిరుదు పిచ్చయ్య, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎస్‌సి సుబ్బారెడ్డి, అధ్యక్షులు సిహెచ్ వెలిగొండరెడ్డి, బాధ్యులు ఎన్ రాజేష్, ఎస్‌డి జానీభాష, సీనియర్ నాయకులు డి నారపరెడ్డి, జాగర్లమూడి వెంకటేశ్వరరావు, మాలాద్రి హేమంత్ పాల్గొన్నారు.