కేక్ కట్ చేస్తున్న అభిమానులు
ప్రజాశక్తి-కందుకూరు :మెగాస్టార్ చిరంజీవి 68వ జన్మదిన వేడుకలు మంగళవారం కోవూరు రోడ్డులో ఉన్న మానసిక వికలాంగుల పాఠశాలలో జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. పిల్లలకు అన్నదానంతోపాటు సరుకులు పంపిణీ చేశారు. సీనియర్ ఫ్యాన్ కె. రమేష్ , పట్టణ చిరంజీవి యువత అధ్యక్షులు దండే రమేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక యువరాజ్ థియేటర్‌లో అభిమానుల సమ క్షంలో చిరంజీవి బర్త్ డే కేక్ కట్ చేశారు. బాణసంచా కాల్చి, ప్రేక్షకులకు స్వీటు, హాటు పంచిపెట్టారు. కె. హరిబాబు, బుడ్డు, పంది వంశి, సాకిరి సాయిచందునాయుడు , దారం మహేంద్ర , సాయికళ్యాణ్, నవీన్,మనీ సాయిరాం ,మనోజ్ ,మేఘనాథ్ ఉన్నారు.










