Aug 10,2023 22:21

బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్న అభిమానులు

ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌: భోళా శంకర్‌ సినిమా విడుదలను పురస్కరించుకుని నగరంలో నటుడు చిరంజీవి అభిమానులు గురువారం బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని చిరంజీవి అభిమాన సంఘం నాయకుడు తైక్వాండో శ్రీను ప్రారంభించారు. అరసవల్లి నుంచి మిల్లు కూడలి, సూర్యమహల్‌ జంక్షన్‌ మీదుగా సన్‌ మ్యాక్స్‌ థియేటర్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, ప్రేక్షకాదరణ తప్పక లభిస్తుందని అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో చిరంజీవి కుటుంబ హీరోల అభిమానులు వైశ్యరాజు మోహన్‌, జోగిపాటి వంశీ, గొర్లె కిరణ్‌ కుమార్‌, సంతోష్‌, లింగాల హరీష్‌, గౌతమ్‌ పుక్కల నవీన్‌, తాళాడ శేఖర్‌, భాను, బన్నీ, అర్జున్‌ పాల్గొన్నారు.