ప్రజాశక్తి - చిప్పగిరి
సాధారణ బదిలీల్లో భాగంగా చిప్పగిరి ఎంపిడిఒగా సివి.కొండయ్యను ప్రభుత్వం నియమించింది. ఇక్కడ ఎఒగా పని చేస్తున్న సుధాకర్ రాజు పదోన్నతిపై అనంతపురం జిల్లాకు బదిలీపై వెళ్లారు. ప్యాపిలి మండల కార్యాలయంలో ఎఒగా పని చేస్తున్న సివి.కొండయ్య పదోన్నతిపై ఎంపిడిఒగా చిప్పగిరికి బదిలీపై వచ్చారు. సోమవారం చిప్పగిరిలో బాధ్యతలు చేపట్టారు. అనంతరం మార్కెట్ యార్డు ఛైర్మన్ గుమ్మనూరు నారాయణను, తర్వాత ఆలూరుకు వెళ్లి మంత్రి జయరామ్ క్యాంపు కార్యాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. విధుల్లో పారదర్శకంగా పని చేయాలని, కింద స్థాయి సిబ్బందితో సఖ్యతగా ఉండి విధులు చేయించుకునేలా ఉండాలని తెలిపారు. వైసిపి ఆలూరు ఇన్‌ఛార్జీ నారాయణ స్వామి, ఎపిఒ మాధవ శంకర్, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.
మంత్రి జయరామ్‌ను కలిసిన చిప్పగిరి నూతన ఎంపిడిఒ కొండయ్య










