Aug 19,2023 19:01

కోటేశ్వరమ్మను అభినందిస్తున్న గోపాలరావు,టిడిపి నాయకులు

ప్రజాశక్తి - లింగసముద్రం :మండలంలోని చినపవని పంచాయితీలో శనివారం జరిగిన ఎన్నికల్లో టిడిపి బలపరిచిన అభ్యర్థి పారా కోటేశ్వరమ్మ విజయం సాధించారు. పంచాయితిలోని రెండో వార్డుకు ఎన్నికలు జరగగా వైసిపి, టిడిపి బలపరిచిన అభ్యర్థులను బరిలోకి దిగారు. 231 ఓట్లుగాను 194 ఓట్లు పోలయ్యాయి. టిడిపి బలపరిచిన అభ్యర్థికి 123 ఓట్లు, వైసిపి బలపరిచిన అభ్యర్థికి 70 ఓట్లు వచ్చాయి. టిడిపి బలపరిచిన అభ్యర్ధి 53 ఓట్లు మేజార్టీతో విజయం సాధించారు. గలుపొందిన కోటేశ్వరమ్మను మండల టిడిపి అధ్యక్షులు వేముల గోపాలరావు,ప్రధాన కార్యదర్శి పూరిమిట్ల మాల్యాద్రి,పెదపవని మాజీ సర్పంచ్‌ నాయబ్‌రసూల్‌,టిడిపి నాయకులు మనోహర్‌, పిచ్చయ్య,పోకూరి రవీంద్ర,మాదవరపు మహేశ్వరరావు, ఉమ్మనేని నరసింహరావు, తూమాటి వెంకటేశ్వర్లు అభినందనలు తెలిపారు.