చిన్నబాబు ఆత్మహత్యకు కారకులపై చర్యలు తీసుకోవాలి : కెవిపిఎస్
ప్రజాశక్తి - వెలుగోడు
దళిత చిన్నబాబు ఆత్మహత్యకు కారకులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కెవిపిఎస్ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం వెలుగోడు సిఐటియు కార్యాలయంలో కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే రామదాసు, సిఐటియు మండల అధ్యక్షులు వి నాగ మోహన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో తోట లైనుకు చెందిన చిన్నబాబును నంద్యాల వన్ టౌన్ పోలీసులు హింసించడంతోనే ఆత్మహత్య చేసుకుడని అన్నారు. చిన్న బాబు కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చి, నంద్యాల టౌన్ లో ప్రభుత్వం ఇంటి స్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగేళ్ల పాలనలో దాదాపుగా 200 మంది దళితులు ఆత్మహత్యకు, హత్యలకు కారణమైందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దళితులపైన జరుగుతున్న దాడులను అరికట్టాలన్నారు. ఈ సమావేశంలో కెవిపిఎస్ నాయకులు వెంకటయ్య, దర్గయ్య, నాగేంద్ర, బాదుల్లా తదితరులు పాల్గొన్నారు.










