ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
చిన్నారులు, గర్భిణుల ఆరోగ్య సంరక్షణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి తెలిపారు. శుక్రవారం పట్టణంలోని 11వ వార్డులో 'పోషణ్ అభియాన్'ను ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, మహిళా కమిషనర్ మెంబర్ రూఖియ బేగం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఆరోగ్యం, వ్యాధులు, పోషకాహార లోపం నివారణకు, రోగనిరోధక శక్తిని పెంపొందించే పద్ధతులను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించినట్లు తెలిపారు. అనంతరం ఆరేళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులకు పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. మున్సిపల్ ఛైర్మన్ రఘు, వైస్ ఛైర్మన్ నజీర్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి పాల్గొన్నారు.
ఈహెచ్‌ఎస్ డిస్పెన్సరీ ప్రారంభం
పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిలో ఈహెచ్‌ఎస్ డిస్పెన్సరీని ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి ప్రారంభించారు. మున్సిపల్ ఛైర్మన్ రఘు, వైస్ ఛైర్మన్ నజీర్ అహ్మద్ పాల్గొన్నారు.
పోషకాహారాన్ని పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే ఎర్రకోట










