Aug 30,2023 21:28

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీష

రాయచోటి : 5-18 ఏళ్ల మధ్య వయసు ఉన్న చిన్నారులను తప్పక బడిలో చేర్పిం చాలని కలెక్టర్‌ గిరీష సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో కలెక్టర్‌ గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియోపై మండల స్పెషల్‌ ఆఫీసర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖ పరిధిలో గ్రాస్‌ ఎన్‌రోల్‌ మెంట్‌ రేషియో సర్వే 100 శాతం పూర్తి చేయాలన్నారు. 5 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు ఉన్న చిన్నారులను కచ్చితంగా బడిలో చేరేలా చూడాలని, ఇందుకోసం మండల ప్రత్యేక అధికారులు ప్రత్యేక దష్టి సారించాలని పేర్కొన్నారు. బడి బయట ఎవరు ఉండకూడదనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ పని చేయాలన్నారు. విద్యార్థుల అభివద్ధికి ప్రభుత్వం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తోందని, ఇందులో భాగంగా పాఠశాలల్లో తొమ్మిది రకాల మౌలిక సదుపాయాలు అభివద్ధి చేసిందన్నారు. విద్యార్థులకు అవసరమైన యూనిఫామ్‌, ష్యూ, బ్యాగు, బెల్ట్‌ అందజేశారన్నారు. అమ్మ ఒడి, విద్యా దీవెన, వసతి దీవెన లాంటి పథకాలు అమలు చేసి, అన్ని రకాల వసతులను పాఠశాలల్లో కల్పిస్తున్నారని చెప్పారు. ప్రతి విద్యార్థి పాఠశాలలకు వెళ్లి మంచి పౌరులుగా ఎదిగేటట్లు చూడాలన్నారు. 10వ తరగతి, ఇంటర్‌లో ఫెయిల్‌ అయిన విద్యార్థులను మరల తిరిగి పాఠశాలల్లో, కళాశాలలో చేర్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వీరికి అమ్మఒడి పథకం వస్తుందనే విషయాన్ని తెలియచేయాలని, ఒక వేళ వారు చేరకపోతే ఓపెన్‌ స్కూల్‌ లోనైనా చేర్పించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఎంఇఒలు పూర్తి స్థాయిలో వాలంటీర్లను సమన్వయం చేసుకొని వంద శాతం గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ రేషియో పూర్తి చేయాలన్నారు. ఎంఇఒలు వారి పరిధిలోని ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకొని ఔట్‌ ఆఫ్‌ స్కూల్‌ చిల్డ్రన్‌ లేని గ్రామంగా తీర్చిదిద్దేందుకు కషి చేయాలన్నారు. కార్యక్రమంలో డిఐఇఒ కష్ణయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి పురుషోత్తం, మండల స్పెషల్‌ ఆఫీసర్లు పాల్గొన్నారు.