Aug 17,2023 19:20

వైద్యపరీక్షలు చేస్తున్న డాక్టర్‌

వైద్యపరీక్షలు చేస్తున్న డాక్టర్‌
చిన్నారులకు వైద్య పరీక్షలు
ప్రజాశక్తి-వరికుంటపాడు:మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్‌ అన్వేష్‌ 32 మంది చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పలు అంగన్‌వాడీ సెంటర్‌ విద్యార్థులు కావడం గమనార్హం. గతంలో ఎత్తు, బరువు, తక్కువగా ఉన్న పిల్లలను గమనించి పలుసార్లు వైద్య శిబిరాన్ని నిర్వహించామని ప్రస్తుతం వీరందరూ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నారని తెలిపారు
. కార్యక్రమంలో వరికుంటపాడు వైద్య అధికారిని ఆయేషా, వైద్య ఆరోగ్య సిబ్బంది. తదితరులు పాల్గొన్నారు.