అచ్చంపేట: రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నా రులకు తాను అండగా ఉంటానని స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. సిఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చిన రెండు లక్షల రూపాయల చెక్కును చిన్నారుల కుటుంబ సభ్యులకు గురువారం ఆయన అందజేశారు. మండలం పరిధిలోని గ్రంథసిరికి చెందిన చిలకా సునీల్, మరియ కుమారి ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వారికి ముగ్గురు పిల్లలు. తల్లి దండ్రులు చనిపోవడంతో ఆ చిన్నారులు వారి తాతయ్య, నాయనమ్మ దగ్గరకు చేరారు. కానీ వాళ్లు కూడా ముసలివాళ్లు కావడంతో పోషణ కష్టంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే, సిఎంఆర్‌ఎఫ్ ద్వారా వచ్చిన రూ.2 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆ కుటుంబానికి అండగా ఉంటానని, ఎప్పుడు ఏ అవ సరమొచ్చినా తనను నేరుగా కలవ వచ్చని చెప్పారు. చిన్నారుల చదువు విష యంలో ఎలాంటి అవసరమొచ్చినా తనను సంప్రదించాలని చిన్నారుల కుటుంబ సభ్యులకు చెప్పారు.










