Mar 14,2023 21:20

మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలాని సామూన్‌


చిన్నారుల ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోండి
రక్తహీనత నివారణకు మెరుగైన చికిత్స
- జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలాని సామూన్‌
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

         ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్లో రక్తహీనతను గుర్తించి నివారణకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ విద్య, వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం నంద్యాల పట్టణంలోని ఎపి మోడల్‌ స్కూల్‌లో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం నిర్వహించారు. ఈ ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులకు కలెక్టర్‌ ఆల్బెండజోల్‌ మాత్రలను పంపిణీ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యార్థుల్లో రక్తహీనతను గుర్తించడంతో పాటు కంటి చూపు, చెవుడు, చెవిలో చీము కారడం, దంత సంరక్షణకు సంబంధించిన ఆరోగ్య పరీక్షలను మెడికల్‌ అధికారులు, వైద్య సిబ్బంది క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆదేశించారు. రక్తహీనతకు ప్రధాన కారణమైన నులి పురుగులను నివారించేందుకు ప్రతి విద్యార్థి ఆల్బెండజోల్‌ మాత్రలను తప్పక తీసుకోవాలన్నారు. జిల్లాలో ఉన్న 3,99,942 మంది పిల్లలందరికీ నులిపురుగుల నివారణ ఆల్బెండజోల్‌ మాత్రలను మింగించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖధికారి డా.ఆర్‌ వెంకటరమణ మాట్లాడుతూ ఆల్‌బెండజోల్‌ మాత్రలు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వేసుకోవడం వలన విద్యార్థుల జీర్ణాశయంలో అన్ని రకాల నులిపురుగులు, వాటికి సంబందించిన గుడ్లు నశిస్తాయన్నారు. మధ్యాహ్నం భోజనం అనంతరం జిల్లా కలెక్టరు విద్యార్థులకు ఆల్‌బెండజోల్‌ మాత్రలు స్వయంగా వేశారు. పాఠశాలలకు గైర్హాజరైన విద్యార్థులకు ఈనెల 18వ తేది వేస్తామని జిల్లా కో ఆర్డినేటర్‌ డా. ఎన్‌.కాంతారావు నాయక్‌ కలెక్టర్‌కు నివేదించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ రవీంద్రారెడ్డి, డిఇఒ అనురాధ, మునిసిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ డా.అంకిరెడ్డి, డా.వినరు, డా.సిసిలియా, పాఠశాల ప్రిన్సిపల్‌ ఫర్హానా, వార్డు కౌన్సిలర్‌ చంద్ర శేఖర్‌, ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పాములపాడు : జాతీయ నులి పురుగు నివారణ కార్యక్రమంలో భాగంగా మండలంలోని అన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు, అంగన్వాడీ కేంద్రాలలోని చిన్నారులకు హెల్త్‌ సిబ్బంది ఆల్బెండజోల్‌ మాత్రలను పంపిణీ చేశారు. ఎంఇఒ బాలాజీ నాయక్‌, జడ్పిటిసి, ఆయా గ్రామాల్లో సర్పంచులు. ఎంపిటిసిలు మాత్రలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని మండల వైద్యాధికారిని సూపర్వైజింగ్‌ చేశారు. రుద్రవరంలోని అంగన్వాడీ కేంద్రంలో వైద్యాధికారిని నాగలక్ష్మి దేవి కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం నాగలక్ష్మి దేవి మాట్లాడుతూ మండలంలో మొత్తం పిల్లలు, విద్యార్థులు 7014 ఉండగా అందులో 6983 మంది పిల్లలకు ఆల్బెండజోల్‌ మాత్రలను మింగించామన్నారు. మిగిలిన వారికి ఈ నెల 18న మింగిస్తామన్నారు. హెల్త్‌ సూపర్వైజర్లు, ఏఎన్‌ఎంలు, అంగన్వాడీ, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. రుద్రవరం : మండలంలోని నరసాపురం ఆలమూరు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో చిన్నారులకు ఆల్బెండా జోల్‌ మాత్రలను పంపిణీ చేశారు. నరసాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్‌ బాబు మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో 1404 మంది చిన్నారులకు ఆల్బెండజోల్‌ మాత్రలను ఇచ్చామన్నారు. ఆలమూరు పిహెచ్‌సి డాక్టర్‌ అమర్నాథ్‌ రెడ్డి మాట్లాడుతూ కేంద్రం పరిధిలో 6,670 మంది చిన్నారులు ఉండగా 6,402 చిన్నారులకు మాత్రలను అందజేశామన్నారు. ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల హెల్త్‌ సిబ్బంది పాల్గొన్నారు. ఆత్మకూర్‌ : ఆత్మకూరు పట్టణంలోని వెంగళరెడ్డి నగర్‌ కాలనీలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో నులిపురుగుల నిర్మూలన దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆత్మకురు మున్సిపాలిటీ చైర్మన్‌ డాక్టర్‌ ఆసియా మాట్లాడారు. జిల్లా సమాచార శాఖ అధికారిని డాక్టర్‌ ప్రభావతి, ఆత్మకూరు కమిషనర్‌ శ్రీనివాసరావు, అర్బన్‌ మెడికల్‌ ఆఫీసర్‌ మహమ్మద్‌ బేగ్‌, హెల్త్‌ ఎడ్యుకేషన్‌ ధనలక్ష్మి, ఏఎన్‌ఎం సుబ్బలక్ష్మి, లక్ష్మీదేవి, ఆశా వర్కర్‌ గౌరీ తదితరులు పాల్గొన్నారు. ఉయ్యాలవాడ : విద్యార్థుల్లో ఉన్న రక్తహీనతను తగ్గించేందుకే ఆల్బెండజోల్‌ మాత్రలు వేస్తున్నామని మండల వైద్యాధికారి వెంకటసుబ్బయ్య తెలిపారు. స్థానిక ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్‌ మాత్రలు వేశారు. పాఠశాల ప్రిన్సిపల్‌ నూర్జహాన్‌, ఎంపిహెచ్‌సిఓ దస్తగిరి, హెల్త్‌ అసిస్టెంట్‌ తదితరులు పాల్గొన్నారు. బనగానపల్లె : నులి పురుగుల నివారణకు ఆల్బెండజోల్‌ మాత్రలు వాడాలని డిప్యూటీ డిఎం అండ్‌ హెచ్‌ఓ మల్లికార్జున రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని టంగుటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ప్రాథమిక పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలో వైద్యాధికారి డాక్టర్‌ శివ శంకరుడు, ఎంపీహెచ్‌ఈఓ నల్లగట్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నులి పురుగుల నిర్మూలన దినోత్సవం నిర్వహించారు. ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. అలాగే మండలంలోని నందవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం బయన్న ఆధ్వర్యంలో నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎస్‌ఆర్‌సిసి జిల్లా కో ఆర్డినేటర్‌ బత్తుల విజయకుమార్‌ మాట్లాడారు. ఉపాధ్యాయులు ప్రసాద్‌, నారాయణ, మురళి, ఏం ఎల్‌ హెచ్‌ పి రాజేష్‌, ఏఎన్‌ఏం, ఆశ వర్కర్లు, జల జీవన్‌ మిషన్‌ స్టార్‌ యూత్‌ అసోసియేషన్‌ ఐఈసి ఎక్స్పర్ట్‌ సుగాశెట్టి బాలయ్య పాల్గొన్నారు. చాగలమర్రి : చాగలమర్రి పట్టణంలో మంగళవారం ఆయా పాఠశాలల్లో విద్యార్థినీ, విద్యార్థులకు నులిపురుగుల నివారణా మందులను పంపిణీ చేశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు అంజలి, ఇమ్రాన్‌, ఎంఈవో అనురాధ, హెచ్‌ వెంకటమ్మ, సూపర్వైజర్‌ రామచంద్రుడు, హెచ్‌ఎం విజయలక్ష్మి, సిబ్బంది. పాల్గొన్నారు. బేతంచెర్ల : బేతంచెర్ల, మండలంలోని గోర్లగుట్ట, సిమెంట్‌ నగర్‌, బుగ్గానపల్లి తదితర గ్రామాలలో ఏఎన్‌ఎం అమల రామాంజనేయులు ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల విద్యార్థులకు ఆల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ చేశారు. మండల వైద్య అధికారి ఎన్‌ గాయత్రి, అస్లాం బేగ్‌, హెచ్‌ఎం శివకుమార్‌ స్వామి, ఆశ వర్కర్లు పాల్గొన్నారు. గోస్పాడు : గోస్పాడు జిల్లా పరిషత్‌ హై స్కూల్‌ను సందర్శించి డాక్టర్‌ గోపాల్‌ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ జగదీష్‌ చంద్ర రెడ్డి విద్యార్థులకు ఆల్‌ బెండజోల్‌ మాత్రలు పంపిణీ చేశారు. హెచ్‌ఎం బాలనాగిరెడ్డి, ఆరోగ్య కార్యకర్తలు రమాదేవి, మహేశ్వరి, ఆశా కార్యకర్తలు హుస్సేనమ్మ, శివలక్ష్మి, సుమలత పాల్గొన్నారు.