ప్రజాశక్తి - భట్టిప్రోలు
వెల్లటూరులో అత్యచారనికి గురైన చిన్నారి కుటుంబానికి అమెరికాకు చెందిన సహృదయ ఫౌండేషన్ సభ్యులు శనివారం రూ.10వేల విలువైన నిత్యావసర సరుకులు అందజేశారు. అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ మానవతా దృక్పథంతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేదలకు సేవలు అందించటం పట్ల గ్రామస్తులు అభినందించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు టి కృష్ణమోహన్ మాట్లాడుతూ చిన్నారి కుటుంబం కడు నిరుపేద కుటుంభమని తెలిపారు. వారిని ఆదుకునేందుకు ఫౌండేషన్ ముందుకు రావడం అభినందనియమని అన్నారు. అలాగే చిన్నారిపై ఆత్య చారనికి పాల్పడిన వ్యక్తిని పాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా తక్షణం శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి వాకా వెంకట నారాయణ, సిపిఎం నాయకులు జి సుధాకర్, ఎం సత్యనారాయణ, వి వెంకట్రామయ్య, జి నాగరాజు ఉన్నారు.










