Mar 28,2023 20:09

వినతిపత్రం ఇస్తున్న సిపిఎం నాయకులు

చిన్న గుమ్మడాపురం రోడ్డు పనులను పూర్తి చేయండి : సిపిఎం

ప్రజాశక్తి - ఆత్మకూరు

ఆత్మకూరు సంగమేశ్వరం ఆర్‌ అండ్‌ బి రోడ్డు బస్‌ స్టాప్‌ నుండి చిన్న గుమ్మడాపురం వరకు పెండింగ్‌లో ఉన్న రోడ్డు పనులను పూర్తిచేయాలని సిపిఎం నాయకులు పంచాయతీ కార్యదర్శి వినోద్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం మండల నాయకులు ఎన్‌ స్వాములు, చిన్న గుమ్మడాపురం శాఖ కార్యదర్శి ఎం జ్ఞాన సూర్యుడు మాట్లాడుతూ చిన్న గుమ్మడాపురం గ్రామానికి ఆర్‌ అండ్‌ బి రోడ్డు బస్‌ స్టాప్‌ నుండి 0.8 కిలోమీటర్ల రోడ్డును 2019 జనవరి రెండో తేదీన రూ.66.70 లక్షల నిధులతో ప్రారంభించారు. మెగా ఇంజనీరింగ్‌ కంపెనీ వాళ్లు పాత రోడ్డును తవ్వి కంకర మాత్రమే వేసి నిర్మాణాన్ని పూర్తి చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. నాలుగు సంవత్సరాలు పూర్తయిన రోడ్డు నిర్మాణం పనులు నిలిచిపోవడం వల్ల గ్రామంలోకి వాహనాల రాకపోకలకు ఇబ్బందికరంగా మారిందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రోడ్డు పనులను పూర్తి చేసేందుకు మెగా ఇంజనీరింగ్‌ కంపెనీ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సంసోన్‌ స్వాములు, ప్రవీణ్‌, తదితరులు పాల్గొన్నారు.