Mar 25,2023 19:44

సిపిఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ

చిన్న గుమ్మడాపురం రోడ్డు పనులను పూర్తి చేయాలి : సిపిఎం

ప్రజాశక్తి - కొత్తపల్లి

ఆర్‌ అండ్‌ బి రోడ్డు బస్‌ స్టాప్‌ నుండి చిన్న గుమ్మడాపురం వరకు 0.8 కిలోమీటర్లు రోడ్డు పనులను పూర్తి చేయాలని సిపిఎం మండల నాయకులు ఎన్‌ స్వాములు, చిన్న గుమ్మడాపురం శాఖ కార్యదర్శి ఎం జ్ఞాన సూర్యుడు డిమాండ్‌ చేశారు. శనివారం నాడు అర్ధాంతంగా నిలిచిపోయిన రోడ్డు పనులను పూర్తి చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్‌ అండ్‌ బి రోడ్డు బస్‌ స్టాప్‌ నుండి చిన్న గుమ్మడాపురం వరకు 0.8 కిలోమీటర్ల రోడ్డు రూ. 66.70 లక్షల నిధులతో 2019 జనవరి 2న ప్రారంభించడం జరిగిం దన్నారు. మెగా ఇంజనీరింగ్‌ కంపెనీ వాళ్ళు అప్పటికే ఉన్న పాత రోడ్డును జెసిబిలతో తవ్వి కంకర మాత్రమే వేసి దానిపై కనీసం మట్టి కూడా వేయకుండా అలాగే వదిలేయడం వల్ల గ్రామ ప్రజల రాకపోకలకు ఇబ్బందికరంగా మారిందన్నారు. మోటార్‌ సైకిల్లు ఆటోలు గ్రామంలోకి వచ్చే పరిస్థితి లేదని, ఆత్మకూరు నుండి రైతులు ఎరువులు సరుకులు తెచ్చుకోవాలంటే గ్రామంలోకి వాహనాలు వచ్చే పరిస్థితి లేదన్నారు. నాలుగు సంవత్సరాలైనా రోడ్డు పనులు పూర్తి చేయకపోవడం వల్ల గ్రామ ప్రజలు ఇబ్బందులకు జరుగుతున్న ప్రభుత్వం గానీ ప్రజా ప్రతినిధులు గాని పట్టించుకోకపోవడం లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తగు చర్యలు తీసుకొని అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులను పూర్తిచేసి ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సంసోను స్వాములు, ప్రభాకర్‌, అబ్రహం, తదితరులు పాల్గొన్నారు.