ప్రజాశక్తి - వేటపాలెం, చిన్నగంజాం
చిన్నగంజాం ఒఓపిఆర్‌డిగా వికెజి మూర్తి శుక్రవారం బాధ్యతలు తీసుకున్నారు. ఈసందర్భంగా మండలంలోని వివిధ పంచాయతీల కార్యదర్శులు ఆయనను కలిసి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువ చేయాలని సూచించారు. గ్రామాల్లో పారిశుధ్యం ఎప్పటికప్పుడు మెరుగుపరచాలని అన్నారు. విధి నిర్వహణలో ఎలాంటి అలసత్వం వహించిన సహించేది లేదని అన్నారు. ఎంపీడీవో కే స్వరూప రాణి ఆయనకు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. కార్యక్రమంలో కార్యదర్శులు మస్తానరావు, సూర్యనారాయణ, కృపారావు, భారతి పాల్గొన్నారు










