ప్రజాశక్తి - తాళ్లరేవు జార్జిపేట వైసిపి సీనియర్ కార్యకర్త పువ్వల చినబాబు తండ్రి పువ్వల వెంకటేశ్వర్లు ఇటీవల మరణించడంతో ఆయన కుటుంబాన్ని ఎంఎల్‌సి బొమ్మి ఇజ్రాయిల్ పరామర్శించారు. ఈ సందర్భంగా 50 కేజీల బియ్యం, రూ.5 వేల నగదును వారి కుటుంబానికి అందించారు. ఈ కార్యక్రమంలో కాట్రేనికోన మండల ఎస్‌సి సెల్ ప్రధాన కార్యదర్శి బడుగు శ్రీనివాసరావు, ఈశ్వరి బారు, ప్రేమ్‌జీ ట్రావెల్స్ అధినేత పల్లేటి ప్రేమ్ కుమార్, సవరపు కన్నా, వినోద్, నవుండ్రు రమేష్, మందపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.










