ఫర్మన్ అహ్మద్ ఖాన్
ప్రజాశక్తి- చింతూరు
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు రెవెన్యూ డివిజన్ సబ్ కలెక్టర్‌గా ఐఎఎస్ అధికారి ఫర్మన్ అహ్మద్ ఖాన్‌ను నియమిస్తూ గురువారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చింతూరు, కూనవరం, విఆర్.పురం, ఎటపాక నాలుగు మండలాలకు కలిపి చింతూరు కేంద్రంగా కొత్తగా రెవెన్యూ డివిజన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో గురువారం సబ్ కలెక్టర్‌ను ప్రభుత్వం నియమించింది. విలీన ముంపు మండలాల ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రజాసమస్యలు పరిష్కరించుకునేందుకు వీలుగా రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేసి ఐఏఎస్ అధికారిని నియమించడం పట్ల చింతూరు డివిజన్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.










