Oct 17,2023 20:21

చింతపండు యూనిట్‌ను ప్రారంభించి పరిశీలిస్తున్న ఎంపీ, కలెక్టర్‌

కురబలకోట(బి.కొత్తకోట) : కురబలకోట మండలంలో ఏర్పాటు చేసిన చింతపండు ప్రాసెసింగ్‌ క్లస్టర్‌ ద్వారా 10 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అన్నారు. మంగళవారం కురబ లకోటలో నూతనంగా ఏర్పాటు చేసిన చింత పండు ప్రాసెసింగ్‌ క్లస్టరును ప్రారం భించారు. కెవైసి నోడల్‌ ఏజెన్సీగా, డిఆర్‌డిఎ ఇంప్లిమెంటింగ్‌ ఏజెన్సీగా, సిఎఫ్‌టిఆర్‌ఐ టెక్నికల్‌ ఏజెన్సీగా ఈ క్లస్టర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నో అభివద్ధి కార్యక్రమాలను చేపట్టిందని తెలిపారు. ఉమ్మడి చిత్తూరు ప్రాంతంలో చింతపండు మీద ఆధారపడి బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పారు. వారందరి భవిష్యత్తును దష్టిలో పెట్టుకొని చింతపండు ప్రాసెసింగ్‌ క్లస్టరును అభివద్ధిపరిస్తే బాగుం టుందని భావించి కేంద్ర ప్రభుత్వ సహకారంతో డిఆర్‌డిఎ ఆధ్వర్యంలో కురబలకోటలో ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రాజెక్టును రూ.3.52 కోట్లతో ఏర్పాటు చేశామన్నారు. ఈ క్లస్టర్‌ కురబలకోట, పుంగనూరు, చౌడేపల్లి, రామసముద్రం, సోమల ప్రాంతాలలోని పది వేల కుటుంబాలకు అండదండగా నిలుస్తుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా కురబలకోట, పుంగనూరు, చౌడేపల్లి, రామసముద్రం మండలాలలోని వివిధ సామాజిక వర్గాలకు చెందిన 1377 మహిళలు లబ్ధి పొందుతారని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా విత్తనాలు తీస ివేసిన చింతపండు, చింతపండు పేస్టు, చింతపండు క్యాండీ, చింతపండు పౌడర్‌, తదితర ఉత్పత్తులను తయారు చేసి మార్కెటింగ్‌ చేస్తారని పేర్కొన్నారు. కలెక్టర్‌ గిరీష మాట్లా డుతూ సంక్షేమ పథకాలే కాకుండా ఎన్నో అభివద్ధి పథకాలు చేపడుతూ ప్రతి ఇంటికి రూ.2 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు లబ్ధి చేకూరుతోందని తెలిపారు.ప్రాసెసింగ్‌ క్లస్టర్‌ కేంద్ర ప్రభుత్వం స్ఫూర్తి పథకం కింద రూపుదిద్దుకుందని తెలిపారు. ఈ క్లస్టర్‌ సంవత్సరానికి 40 వేల మెట్రిక్‌ టన్నుల చింతపండును ఉత్పత్తి చేస్తుందని పేర్కొన్నారు. రూ.100 కోట్ల సంవత్సర ఆదాయం ఉంటుందని, 30 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తుందని ఎస్‌హెచ్‌జి మహిళలకి ఉపాధి లభించనుందని తెలిపారు. అన్నమయ్య, అనంతపురం జిల్లాల నుండి మాత్రమే కాకుండా కర్ణాటకలోని కోలార్‌, మహారాష్ట్రలోని నాసిక్‌, ఒడిస్సాలోని సంబల్పూర్‌, చత్తీస్‌ ఘడ్‌లోని జగదల్పూర్‌ జిల్లాల నుండి చింతపండు సేకరిస్తామని పేర్కొన్నారు. ఈ క్లస్టర్‌ ఉత్పత్తులను దేశంలోని వివిధ ప్రాంతాలకు, విదేశాలకు కూడా ఎగుమతి చేస్తామని పేర్కొన్నారు. చింతపండు ఆధారిత కుటుంబాలు ఎంతో లబ్ధి పొందుతాయని తెలిపారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వంలో కేవలం హామీలు మాత్రమే ఇచ్చారని, ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకున్నారని తెలిపారు. తంబళ్లపల్లిలోని ప్రతి గ్రామంలో సిసి రోడ్లను ఏర్పాటు చేసిన ఘనత ప్రభుత్వానిదేనని తెలిపారు. కురబ లకోట మండ లంలో ఏర్పాటు చేసిన చింతపండు ప్రాసెసింగ్‌ క్లస్టర్‌ ద్వారా ఎన్నో కుటుంబాలు లబ్ధి పొందుతాయని, ఈ క్లస్టరును అందరు వినియోగించుకోవాలని సూచించారు. రాష్ట్ర మైనారిటీ కమిషన్‌ చైర్మన్‌ ఇక్బాల్‌ మాట్లాడుతూ ప్రభుత్వంలో ఎన్నో అభివద్ధి కార్యక్రమాలు చేపట్టారని, తంబళ్లపల్లి నియో జకవర్గంలో ఏర్పాటు చేసిన చింతపండు ప్రాసెసింగ్‌ యూనిట్‌ అందుకు ఒక ఉదాహరణమని తెలిపారు. ఈ యూనిట్‌ని నియోజకవర్గ ప్రజలందరూ ఉపయోగించుకొని అభివద్ధి చెందాలని కోరారు. కార్యక్రమంలో డిఆర్‌డిఎ పీడీ సత్యనారాయణ, ప్రజాప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.